Papaya is a mine of nutrients. No other fruit offers as many health benefits as it does. It is rich in Vitamin A, Vitamin B, Vitamin C and other nutrients. Papaya is low in calories and high in nutrients. It contains minerals like magnesium, iron, calcium, phosphorus and manganese along with vitamins.
Ripe papaya is usually consumed more. But experts say that raw papaya and papaya leaves are also very beneficial for health. Due to its fiber content and antioxidants, blood circulation can be improved. Also, green papaya is very helpful in reducing bad cholesterol levels. It also promotes the digestive process. Checks joint problems. Helps in weight loss.
Telugu version
బొప్పాయి పోషకాల గని.. అది అందించినన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరే ఇతర పండు ఇవ్వలేదు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ ఇంకా ఇతర పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుండటం విశేషం. ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉన్నాయి.
సాధారణంగా పండిన బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే పచ్చి బొప్పాయి, బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్,యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది.
అంతేకాక పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. ఇంకా జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కీళ్ల సమస్యలకు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.