మోనాలిసా: తల్లిపై ప్రేమను చాటుకున్న మోనాలిసా.. తొలి సినిమా పారితోషికంతో ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలు అమ్మి వైరల్ అయిన మోనాలిసా సోషల్‌ మీడియాలో మరింత చర్చా వాయువుగా మారింది. తాజాగా, ఆమె తన అమ్మకి బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని చిన్న పల్లెటూరి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన మోనాలిసా, తన అందం, కాంతి, చిరునవ్వుతో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ అవడంతో రాత్రికి రాత్రే వైరల్ అయి, సెలబ్రిటీగా మారిపోయింది.

తరువాత, కుంభమేళాకు వచ్చిన ప్రజలు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడటం మొదలెట్టారు. కొన్ని రోజులపాటు ఆమె ఫొటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా దుమారం రేపింది.

ఈ క్రమంలో, మోనాలిసాకు బాలీవుడ్ నుండి ఒక భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, "ది డైరీ ఆఫ్ మణిపూర్" అనే సినిమా కోసం మోనాలిసాను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఈ సినిమాకు పారితోషికంగా 21 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

మొదటి సినిమాకు పారితోషికం పొందిన తర్వాత, మోనాలిసా తన అమ్మకు బంగారు గొలుసు కొనిచ్చి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ, "చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో!" అని చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens