Shocking Reason Pigeons are the death cause of Meena Husband Vidyasagar

English Version

Meena's house tragedy News.. The news that senior actress Meena has lost her husband has caused a stir in movie circles and Meena fans. Vidyasagar died at the MGM Hospital in Chennai. But now some suspicions have begun to surface over his death. Along with Vidyasagar, the entire Meena family has been infected with corona in the past. Although he was recovering at the time, he had been suffering from postcovid problems for a few months and was recently hospitalized with a lung infection. Concerned neo-hippies and their global warming, i'll tell ya. Searched for Lungs from a man who was brain dead. Meanwhile, Vidyasagar died suddenly. When another version hears that post covid problems alone may not have been the cause of his death, he has been skinned by the pigeons he raises out of love.

Pigeons are the lifeblood of Vidyasagar. There were some pigeons near his house. Feeding them and watching Alaina rule turned it into a hobby. Kovid spent most of his time among the pigeons after he became infected, ignoring the doctors' prescription. According to sources, this has doubled Vidyasagar's respiratory problems and turned out to be fatal. Do pigeons that claim to be replicas of love and doves of peace become deadly? The topic of once again began in the masses. Scientists warn that pigeons should be kept as far away as possible from humans, especially those with chronic diseases such as HIV, diabetes, organ transplants and steroid takers. Pigeons do not have a separate bladder. This results in both faeces being excreted. So scientists say pigeon excretion is the most dangerous.
 

In the past, there was a fear that pigeons could spread the Nifa virus. Some studies have even shown that pigeon droppings can cause serious health problems. The pigeons' excrement dries up and their particles come together in a gallon and reach inside when we breathe. Then gradually leading to lung infection. That is why doctors advise people suffering from lung problems to stay away from pigeons. Some countries have already banned pigeons from feeding in public. There have been some reports in the past of people staying close to pigeons and falling ill and losing their lives. But so far there is no conclusive evidence that… pigeons are lethal. This topic is currently under research. For whatever reason, Vidyasagar's death is a tragedy for Meena's family. Vidyasagar hails from Bangalore and works as a software engineer. Vidyasagar was married to Meena on July 12, 2009, 13 years ago. They also have a daughter, Nainika.

Telugu Version

మీనా ఇంట తీవ్ర విషాదం… భర్తను కోల్పోయిన సీనియర్ నటి మీనా.. అనే వార్తలు సినీ సర్కిల్స్ లోనూ, మీనా అభిమానుల్లోనూ కాస్త కలవరం పుట్టించాయి. చెన్నైలోని(Chennai) MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్ (Vidyasagar). కానీ… ఆయన మృతిపై ఇప్పుడు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. విద్యాసాగర్తో పాటు… మీనా కుటుంబం మొత్తానికి గతంలో కరోనా సోకింది. అప్పట్లో ఆయన కోలుకున్నప్పటికీ… కొన్ని నెలలుగా పోస్ట్  కోవిడ్  సమస్యలతో బాధపడుతున్నారు  లంగ్ ఇన్ఫెక్షన్ తో రిసెంట్ గా ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సివచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ కోసం వెతికారు. అంతలోనే విద్యాసాగర్ ఆకస్మికంగా మృతిచెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, ఆయన ప్రేమతో పెంచుకుంటున్న పావురాలే ఆయన్ను పొట్టనబెట్టుకున్నాయని మరో వెర్షన్ వినిపిస్తోందిప్పుడు.

విద్యాసాగర్ కి పావురాలంటే ప్రాణం. ఆయన ఇంటి సమీపంలో కొన్ని పావురాలుండేవి. వాటికి దాణా వేస్తూ ఆలనా పాలనా చూస్తూ దాన్నొక హాబీగా మార్చుకున్నారు. కోవిడ్  సోకిన తర్వాత… డాక్టర్ల సూచన పట్టించుకోకుండా ఆయన పావురాల మధ్యనే ఎక్కువగా గడిపేవారు. దీనివల్లే విద్యాసాగర్  శ్వాసకోశ సమస్యలు రెట్టింపయ్యాయని, అది ప్రాణాంతకంగా మారిందని చెబుతున్నారు సన్నిహితులు . ప్రేమకు ప్రతిరూపాలుగా, శాంతి కపోతాలుగా చెప్పుకునే పావురాలు ప్రాణాంతకంగా మారతాయా…? అనే టాపిక్ మరోసారి జనంలో మొదలైంది. ఆరోగ్యపరంగా చూస్తే పావురాలకు మనుషులు ముఖ్యంగా హెచ్ ఐవీ, మధుమేహం, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అవయవ మార్పిడి చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు తీసుకునేవారు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పావురాలకు ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మలమూత్రాలు రెండు ఉంటాయి. కనుక పావురాల విసర్జకం అత్యంత ప్రమాదకరమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు .

 పావురాలతో నిఫా వైరస్ లాంటివి వ్యాపిస్తాయని గతంలో ఒక భయం వెంటాడేది. పావురాల విసర్జితాల ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా తేల్చేశాయి. పావురాల విసర్జితాలు ఎండిపోయి వాటి రేణువులు గాల్లో కలిసి… మనం ఊపిరి తీసుకున్నప్పుడు లోనికి చేరతాయి. తర్వాత క్రమంగా లంగ్ ఇన్ఫెక్షన్ కి దారితీస్తాయి. అందుకే… ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవాళ్లు పావురాలకు దూరంగా ఉండాలని డాక్టర్లే సజెస్ట్ చేస్తారు. పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వెయ్యడాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు నిషేదించాయి కూడా.  పావురాలకు దగ్గరగా ఉంటూ… అనారోగ్యం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ గతంలో కూడా కొన్ని వార్తలొచ్చాయి. కానీ… పావురాలు ప్రాణాంతకమే అని నిర్ధారించే నిఖార్సయిన రుజువులేవీ ఇప్పటిదాకా లేవు. ప్రస్తుతానికి ఈ అంశం రిసెర్చ్ దశలోనే ఉంది. కారణాలేవైనా విద్యాసాగర్ మరణం మీనా కుటుంబానికి తీరని విషాదం. బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. 13 ఏళ్ల కిందట 2009 జూలై 12న మీనాకు, విద్యాసాగర్  కీ పెళ్లయింది. వీళ్లకు నైనికా అనే కుమార్తె కూడా ఉంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens