Less and Discount Price in Chicken Shop

The man used to sell chicken at an eye-watering discount every time. People have never seen such huge discounts even in other local shops. The person in question announced huge discounts on chicken even on Bakrid festival the other day. That's it! Before long, his shop was full in no time. If the scene is cut.. then the rest of the businessmen there got to know the meaning behind these sales.. So what is the story?

Going into the details... 31-year-old Afsal runs a local chicken shop in Vattankulam, Kerala. Every time he used to sell chicken at a low price with huge discounts to the customers who came to his shop. During Bakrid festival also Rs. 10 to Rs. He announced a discount on chicken up to 20. As a result, Afsal's shop became crowded, and the other local chicken shops went bankrupt. Actually low prices.. and then eye-catching discounts.. but why Afsal does not get loss. The rest of the shop owners were in doubt as to how the profits came and went. With this, they all came together like a coupi.. the real thing came out. By manipulating his scale through a remote controller, Afsal realizes that he is cheating the customers. He is caught red-handed and handed over to the police.

Meanwhile, the police registered a case against Afsal and took him into custody and started investigation. Are any local businessmen committing such scams? Or.? They are inquiring. Also, the police have warned the traders that strict action will be taken if they commit such fraudulent activities.

Telugu Version

ఆ వ్యక్తి ప్రతీసారి కళ్లు చెదిరే డిస్కౌంట్తో చికెన్ విక్రయించేవాడు. స్థానికంగా ఉండే మిగిలిన షాపులలో కూడా అంతటి భారీ డిస్కౌంట్లు జనం ఎప్పుడూ చూడలేదు. మొన్న బక్రీద్ పండుగ నాడు కూడా చికెన్పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించాడు సదరు వ్యక్తి. అంతే! ఇంకేముంది అతడి షాప్ క్షణాల్లో హౌస్ఫుల్ అయింది. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత ఈ సేల్స్ వెనుక అంతర్ధానం తెలుసుకున్నారు అక్కడున్న మిగతా వ్యాపారస్తులు.. ఇంతకీ ఆ కథేంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వట్టంకులం అనే ప్రాంతంలో 31 ఏళ్ళ అఫ్సల్ స్థానికంగా చికెన్ షాప్ నడుపుతున్నాడు. ప్రతీసారి తన షాప్కు వచ్చిన కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్లతో తక్కువ ధరకే చికెన్ విక్రయిస్తూ వచ్చాడు. బక్రీద్ ఫెస్టివల్ సమయంలోనూ రూ. 10 నుంచి రూ. 20 వరకు చికెన్పై డిస్కౌంట్ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అఫ్సల్ షాప్ రద్దీగా మారగా.. స్థానికంగా ఉండే మిగతా చికెన్ షాపులు విలవిలలాడాయి. అసలే తక్కువ ధరలు.. ఆపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అయినా అఫ్సల్కు లాస్ ఎందుకు రావట్లేదు. లాభాలు ఎలా వచ్చి పడుతున్నాయని మిగతా షాప్ యజమానులకు డౌట్ వచ్చింది. దీనితో వారంతా కలిసి కూపీ లాగగా.. అసలు విషయం బయటపడింది. రిమోట్ కంట్రోలర్ ద్వారా తన తూకాన్ని తారుమారు చేస్తూ.. కస్టమర్లను అఫ్సల్ మోసం చేస్తున్నాడని గుర్తిస్తారు. అతడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు.

కాగా, అఫ్సల్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానిక వ్యాపారస్తులు ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారా.? లేదా.? అనే విషయాలను ఎంక్వయిరీ చేస్తున్నారు. అలాగే ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను పోలీసులు హెచ్చరించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens