కొడాలి నాని: వంశీ అరెస్ట్ పై రిపోర్టర్ అడిగిన ప్రశ్న... 'అరెస్ట్ లానే చూస్తాం' అని కొడాలి నాని చమత్కారం

వైసీపీ నేత కొడాలి నాని ఇవాళ ఒక రిపోర్టర్‌తో మాట్లాడుతుండగా, కట్టె విరిచినట్టు సమాధానాలు ఇచ్చారు. సాధారణంగా మీడియాతో సరదాగా మాట్లాడే కొడాలి నాని, ఆరు టీవీ చానల్ మహిళా రిపోర్టర్‌తో మాత్రం కాస్త చిరాకుగా మాట్లాడారు.

కొడాలి నాని, రిపోర్టర్ సంభాషణ:

రిపోర్టర్: "కొడాలి నాని గారు, ఇన్ని రోజులు ఏమైపోయారు?" కొడాలి నాని: "ఎమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే ప్రతి రోజు వచ్చి కనిపించి వెళ్ళిపోతాను. మీకు, రాధాకృష్ణకు, బీఆర్ నాయుడికి, ఇంకా కొంతమంది పేర్లు చెబితే వాళ్లందరికీ కనిపించి వెళ్ళిపోతాను!"

రిపోర్టర్: "అంతకుముందు బాగా యాక్టివ్ గా ఉండేవాళ్లు, బాగా మాట్లాడేవాళ్లు!" కొడాలి నాని: "అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి యాక్టివ్ గా ఉండేవాళ్లు... ఇప్పుడు ఏమి చేయాలి?"

రిపోర్టర్: "మరి ఇప్పుడు భయపడుతున్నారా?" కొడాలి నాని: "ఎందుకు?"

రిపోర్టర్: "గవర్నమెంట్ లో లేనందుకు ఏదైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా?" కొడాలి నాని: "కాదమ్మా... నువ్వు యాక్టివ్ గా మైక్ పట్టుకుని తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా... ఇప్పుడు యాక్టివ్ గా ఉండి ఏం చేయాలి?"

రిపోర్టర్: "వల్లభనేని వంశీ అరెస్ట్ ను ఎలా చూస్తారు?" కొడాలి నాని: "అరెస్ట్ లానే చూస్తాం. ఏముంది? ఇవన్నీ మామూలుగా జరిగే చిన్న విషయాలు."

రిపోర్టర్: "నెక్ట్స్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని, రెడ్ బుక్ లో మీ పేరు ఉందని ప్రచారం జరుగుతోంది." కొడాలి నాని: "నేను చూడలేదు... రెడ్ బుక్ మీరేమైనా చూశారా? నాకు చూపించలేదు, మీకు చూపించాడా?"

రిపోర్టర్: "పార్టీలో మీరు ఉన్నారు కదా?" కొడాలి నాని: "ఏ పార్టీలో?"

రిపోర్టర్: "ప్రస్తుతం వైసీపీలో మీరు యాక్టివ్ గానే ఉన్నారు కదా!" కొడాలి నాని: "ఇంతకుముందే కదా నేను యాక్టివ్ గా లేనని నువ్వే చెప్పావు. ఈ రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు వల్ల ఏం ఉపయోగం లేదు."

రిపోర్టర్: "గుడివాడలో మీపై మూడు కేసులు ఫైల్ అయ్యాయని అంటున్నారు." కొడాలి నాని: "మూడు కాకపోతే 30 కేసులు చేసుకోనీ... ఇంత మంది లాయర్లు ఉన్నారు, వాళ్లు చూసుకుంటారు!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens