If someone talks to a girl a bit sweetly..everyone thinks that he is having sex..they tease him. But only after that, if that pulihora comes true.. if the girl likes it... and thinks that it will be united with a three-pronged bond... then those who commented.. will be very shocked. Recently, Janaki Kalaganalu serial hero..Some people are talking about Amardeep in the same way. Kannada beauty Tejaswini, who made a name for herself in the Telugu television industry with the movie Friends and Followers and Netizens Koilamma, recently shocked everyone by getting engaged to this hero. These two who are currently at the peak stage of their careers, when did they become lovers..? While everyone outside is talking about it..but Nettinta is attracted by the comments that Puliharo is holding a nice drop. The tag of 'Made for each other' is being attached to them. But Ariana, who went to their engagement, took a video of both of them and shared it on her Instagram. This matter came out. Nettinta is now going viral.
Telugu Version
ఎవరైనా అమ్మాయితో కాస్త చనువుగా మాట్లాడితే.. పులిహోర కలిపేస్తున్నాడని అందరూ అనుకుంటారు.. వాన్ని ఆటపట్టిస్తుంటారు. కాని ఆ తరువాతే ఆ పులిహోరే నిజమై.. ఆ అమ్మాయికి నచ్చి… మూడు ముళ్ల బంధంతో ఏకమవుదామని అనుకుంటే.. అప్పుడు కామెంట్ చేసిన వారే.. కళ్లప్పగించి మరీ షాకవుతారు. తాజాగా జానకి కలగనలేదు సీరియల్ హీరో.. అమర్ దీప్ విషయంలోనూ ఇలాగే నోరెళ్ల బెడుతున్నారు కొంత మంది ఆయన ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ నెటిజెన్స్ కోయిలమ్మ సినిమాతో తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో నామ్ కమాయించిన కన్నడ బ్యూటీ తేజస్విని.. తాజాగా ఈ హీరోతో ఎంగేమ్మెంట్ చేసుకుని అందర్నీ షాక్ చేసింది. ప్రస్తుతం కెరీర్లో ఇద్దరు పీక్ స్టేజ్ లో ఉన్న వీరు ఎప్పుడు ప్రేమికులుగా మారారా..? అని బయట అందరూ మాట్లాడుకుంటుంటే.. నెట్టింట మాత్రం పులిహారో గట్టిగా కలిపి చక్కని చుక్కను పట్టినట్టు ఉన్నాడనే కామెంట్స్ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ట్యాగ్ను వీరికి కట్టబెడుతున్నాయి.అయితే వీరి ఎంగేజ్ మెంట్కు వెళ్లిన ఆరియానా.. వీరిద్దరిని వీడియో తీసి తన ఇన్స్టాలో షేర్ చేయడంతో… ఈ విషయం బయటికి వచ్చింది. నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది.