IND vs PAK: Team India avenged last year's T20 World Cup defeat. Daiyadi gave a perfect answer to the terrible defeat in that match against Pakistan. The bowlers played a game against Pakistan who came to bat first. Especially Bhuvi and Pandya showed their ability. Except Rizwan, our bowlers did not let anyone stand. Bhuvi recorded best figures against Pakistan. Taking 4 wickets for 26 runs.. Pandya who broke out at crucial times gave 24 runs and took 3 wickets. With this, Pakistan were bowled out for 147 in 19.5 overs.
India lost the wicket of Rahul early in the target chasing. But Rohit and Kohli helped. Kohli scored 35 runs in 34 balls. It has one six and three fours. But these two got out at the crucial time. Then Jadeja and Pandya, who came to the ring, showed Pakistan. Jadeja came to play according to the pitch. But Pandya tends to score quick runs. Jadeja scored 35 runs off 29 balls. It has two sixes and two fours. In the last over, Jadeja tried not to hit a big shot and got out on the first ball. A single off the second ball. The third ball was not hit. Six more runs to be scored in three balls. At this point, Pandya gave a signal that he would take care of everything. After hitting a huge six on the next ball, the stadium came closer.
Telugu Version
IND vs PAK: గతేడాది టీ20 వరల్డ్ కప్ ఓటమికి అచ్చంగా ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. దాయాది పాకిస్తాన్తో జరిగిన ఆ మ్యాచ్లో దారుణ ఓటమికి.. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన పాక్ని ఓ ఆటాడుకున్నారు బౌలర్లు. ముఖ్యంగా భువి, పాండ్యా తమ సత్తా చాటారు. రిజ్వాన్ తప్ప.. ఇంకెవర్నీ నిలదొక్కుకోనివ్వలేదు మన బౌలర్లు. భువి పాకిస్తాన్పై బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 26 పరుగులకు 4 వికెట్లు తీస్తే.. కీలక సమయాల్లో చెలరేగిన పాండ్యా 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 147కి ఆలౌట్ అయింది.
టార్గెట్ చేజింగ్లో భారత్ ఆదిలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్, కోహ్లీ ఆదుకున్నారు.కోహ్లీ 34 బంతుల్లో 35పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్స్, మూడు ఫోర్లున్నాయి. కాని కీలక సమయంలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. అప్పుడు బరిలో దిగిన జడేజా, పాండ్యా పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. జడేజా పిచ్కి తగ్గట్లుగా ఆడుతూ వచ్చాడు. కాని పాండ్యా వేగంగా పరుగులు సాధించేందుకు మొగ్గు చూపాడు. జడేజా 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, రెండు ఫోర్లున్నాయి. చివరి ఓవర్లో జడేజా భారీ షాట్ కొడదామని యత్నించి.. ఫస్ట్ బాల్కే ఔటయ్యాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బాల్ తగల్లేదు. ఇంకా మూడు బాల్స్లో ఆరు పరుగులు చేయాలి. ఈ సమయంలో పాండ్యా అంతా నేను చూసుకుంటానన్న సిగ్నల్ ఇచ్చాడు. తర్వాతి బాల్కి భారీ సిక్సర్ కొట్టడంతో.. ఒక్కసారిగా స్డేడియం దగ్గరిల్లింది..