తపాలా శాఖ నుంచి 2025లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పాస్ అయిన వారికి తపాలా శాఖ నుంచి గుడ్ న్యూస్. భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాల్లో పని చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 1,215 పోస్టులు, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది.
అభ్యర్థులకు అర్హతలు
పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలను తప్పనిసరిగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. వయసు 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2025 నుంచి మార్చి 3, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. జనరల్ అభ్యర్థులు ₹100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపికైనవారికి ₹10,000 నుంచి ₹29,380 వరకు జీతం అందుతుంది.