Important alert for the devotees who go for darshan of Srivari on foot

TTD has brought some changes in issuing Divya Darshan (DD) tokens to devotees in Tirupati. The Tirumala Tirupati Devasthanam said that Divya Darshan Tokens will be issued only at the Bhudevi Complex to devotees who wish to take the Alipiri trail route.

 After getting the tokens, they have to scan the tokens at 2083 step of Alipiri footpath, otherwise they will not be given slotted darshan. Previously, DD tokens were issued at Galigopuram on the Alipiri trail leading to Tirumala, but now they have been shifted to Bhudevi Complex. Devotees who have received divine darshan tokens at Bhudevi Samudaya will be eligible for darshan only if they reach Tirumala via Alipiri trail.

Meanwhile, the devotees going to the Srivari Mettu on foot will be issued tokens at the 1240th step of the path as usual. Devotees reaching Tirumala by road are issued slotted Sarva Darshanam tokens at Srinivasa, Vishnu Nivasam and Govindaraja Swamy Choultries in Tirupati. TTD officials advised that devotees should observe these facilities and guidelines and plan their pilgrimage to Tirumala accordingly.

Telugu version

తిరుపతిలో భక్తులకు దివ్య దర్శనం (డీడీ) టోకెన్ల జారీలో టీటీడీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అలిపిరి కాలిబాట మార్గంలో వెళ్లాలనుకునే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే జారీ చేయబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. టోకెన్లు పొందిన తర్వాత, వారు అలిపిరి ఫుట్‌పాత్ 2083వ మెట్టు వద్ద టోకెన్‌లను స్కాన్ చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారికి స్లాటెడ్ దర్శనం అందించబడదని స్పష్టం చేసింది.

 గతంలో తిరుమలకు వెళ్లే అలిపిరి కాలిబాటలోని గాలిగోపురం వద్ద డీడీ టోకెన్లు జారీ చేయగా ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. భూదేవి సముదాయంలో దివ్య దర్శన  టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటేనే దర్శనానికి అర్హులు అవుతారు.

కాగా, శ్రీవారి మెట్టు కాలినడకన వెళ్లే భక్తులకు యథావిధిగా ఆ మార్గంలోని 1240వ మెట్టు వద్ద టోకెన్లు జారీ చేస్తారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి చౌల్ట్రీల వద్ద స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను జారీ చేస్తారు. భక్తులు ఈ సౌకర్యాలు, మార్గదర్శకాలను గమనించి, తదనుగుణంగా తిరుమలకు తమ తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens