Due to today's lifestyle and food habits, people of all ages are suffering from chronic diseases like heart attack, diabetes and hypertension. Due to this, there is a situation of having to use medicines for life. Obesity in particular is the root cause of all problems. Accumulation of fat in the body increases the risk of heart disease. Lakhs of money go around doctors making hospitals. In fact, health experts say that there are many ways to reduce body fat.
If you drink a glass of Amla-Arjuna juice every day, fat will melt. How to make it.. Cut the amla seeds into small pieces and put them in a mixer and squeeze the juice out of it. Then pour two cups of water in a vessel and boil it well. When the water is boiling, add a piece of Terminalia arjuna bark and boil it. After cooling it can be strained and stored in a bottle. You can drink this juice every morning on an empty stomach without mixing it with warm water and adding a little honey to it for taste.
Telugu version
నేటి జీవన శైలి, ఆహార అలవాట్ల వల్ల వయసుతో సంబంధంలేకుండా అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్, షుగర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆజన్మాంతం మందులు వాడుకోవల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉబకాయం అన్ని సమస్యలకు మూలకారణం. శరీరంలో కొవ్వు పేరుకుపోయి, గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. లక్షలాది డబ్బు ఆసుపత్రులపాలు చేస్తూ వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు. నిజానికి శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వీటిల్లో ఉసిరి-అర్జున జ్యూస్‌ను ప్రతి రోజూ ఓ గ్లాస్ తాగారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుందట. ఎలా తయారు చేసుకోవాలంటే.. ఉసిరి కాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి దాని నుంచి రసం వయకట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే అర్జున చెట్టు (Terminalia arjuna) బెరడు ముక్కను అందులో వేసి మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి వడకట్టుకుని ఓ బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ రసాన్ని గోరువెచ్చని నీళ్లలో కలుపుని, రుచి కోసం దానిలో కొంచెం తేనె కూడా కలుపుని తాగవచ్చు.