If a girl child is born in that state, a bond of Rs. 50,000, food for the poor for Rs. 5. BJP's gifts

She said that if they come to power again in the state... they will give more autonomy to the wild children... adivasis.

 Under Tripura Janajati Bikash each tribal family will get Rs. 5,000 annual financial assistance will be provided.. It has been stated that the Adivasi Area Self-Government Council will be reorganized. Moreover, JP Nadda announced that more legal, administrative and financial powers will be given to the tribals. Not only that, he also promised to set up an Adivasi University in the name of Maharaja Vikram Manikya.

On the other hand, it rained several times which impressed the woman. If a girl child is born in an economically backward family, under the Bali Samriddhi Scheme, each family will receive Rs. 50,000 bond will be given. Moreover, the Chief Minister has promised to provide smartphones and free scooty to around 50,000 students going to talented colleges under the Yuva Yoga Yoga Yojana.

 Two LPG cylinders will be given to housewives and free rice and wheat to all PDS beneficiaries. Nadda said that they will distribute pattabhoomi to the landless in the state. The assistance provided to farmers under PM Kisan will be increased from Rs.6 thousand to Rs.8 thousand.

 Under the Bhumihin Kisan Vikas Yojana, an annual financial assistance of ₹ 3,000 has been promised to all landless farmers. It is mentioned that they will provide food worth Rs.5 to the poor.

The manifesto also included drinking water connections to every household under the Urban by 2025, Jal Jeevan Mission by 2024 and doubling the annual limit per family from ₹ 5 lakh to ₹ 10 lakh under Ayushman Bharat.

Telugu version

రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తే.. అడవి బిడ్డలు .. ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది.

 త్రిపుర జనజాతి బికాష్ కింద ప్రతి గిరిజన కుటుంబానికి రూ. 5,000 వార్షిక ఆర్థిక సహాయం అందిస్తామని.. ఆదివాసీ ప్రాంత స్వయం ప్రతిపత్తి మండలిని పునర్‌వ్యవస్థీకరిస్తామని పేర్కొంది. అంతేకాదు ఆదివాసీలకు మరింత చట్టపరమైన, పాలన, ఆర్థిక అధికారాలు అప్పగిస్తామని  జె.పి.నడ్డా ప్రకటించారు. అంతేకాదు.. మహారాజా విక్రమ్‌ మాణిక్య పేరిట ఆదివాసీ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు.

మరోవైపు మహిళను ఆకట్టుకునే విధంగా అనేక వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబంలో ఆడపిల్లలు పుట్టిడితే బాలికా సమృద్ధి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 50,000 బాండ్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి యువ యోగా యోగ్ యోజన కింద ప్రతిభావంతులైన కళాశాలలకు వెళ్లే సుమారు  50 వేల  మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ఉచిత స్కూటీని అందజేస్తామని హామీ ఇచ్చారు.

 గృహిణులకు రెండు ఎల్పీజీ సిలిండర్లు, పిడిఎస్ లబ్ధిదారులందరికీ బియ్యం , గోధుమలు ఉచితంగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో భూమిలేనివారికి పట్టాభూమి పంపిణీ చేస్తామని నడ్డా చెప్పారు. 

పీఎం కిసాన్‌ కింద రైతులకు అందిస్తున్న సాయాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచుతామన్నారు. భూమిహిన్ కిసాన్ వికాస్ యోజన కింద భూమిలేని రైతులందరికీ ₹ 3,000 వార్షిక ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు రూ.5 లకె భోజనాన్ని అందించనున్నామని పేర్కొన్నారు.

వచ్చే 2025 నాటికి అర్బన్, వచ్చే 2024 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి వార్షిక పరిమితిని ₹ 5 లక్షల నుండి ₹ 10 లక్షలకు రెట్టింపు చేయడం వంటివి కూడా మ్యానిఫెస్టోలో చేర్చింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens