Hero Sonu Sood visited Nature Cure Hospital.

Popular film actor Sonusood visited Nature Cure Hospital in Hyderabad. On this occasion, the under-construction cottages, dining hall, yoga premises along with the medical, diet and other facilities provided here were inspected. Also enjoyed the greenery in the clinic premises.

 Also planted sapangi sapling along with doctors and students. Doctors and students took selfies with Sonusood.

 Speaking on this occasion, he said that the manner in which the Minister of Health and Medicine Harish Rao is taking the state forward towards a healthy Telangana towards achieving the will of CM KCR is commendable.

 Mmele Guvwala Balaraju of Achchampet, Errolla Srinivas, Chairman TSMSIDC, Ayush Commissioner Prashanthi and others participated in this program.

Telugu version

హైదరాబాద్ లోని ప్రకృతి చికిత్సాలయం (నేచర్ క్యూర్) ఆస్పత్రిని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సందర్శించారు.

 ఈ సందర్భంగా చికిత్సాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కాటేజీలు, భోజనశాల, యోగా ప్రాంగణంతో పాటు ఇక్కడ అందుతున్న వైద్యం, డైట్, తదితర వసతులను పరిశీలించారు. అలాగే చికిత్సాలయ ఆవరణలో నెలకొన్న పచ్చదనాన్ని ఆస్వాదించారు.

 అలాగే వైద్యులు, విద్యార్థులతో కలిసి సంపంగి మొక్కను నాటారు. సోనూసూద్‌తో కలిసి వైద్యులు, విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు.

 ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని సాధించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రశంసనీయమన్నారు.

 ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆయుష్‌ కమిషనర్‌ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens