Heavy Security for Prime Minister Modi's visit to Hyderabad

English Version

Police have tightened security in the wake of Prime Minister Modi's visit to Hyderabad. Security is provided at four levels. The Prime Minister was surrounded by the SPG as well as the Intelligence Security Wing and the National Security Guards. Snipers, quick response teams and mufti parties patrolled the areas where Modi was going. SPG has already examined all the areas. SPG officials, meanwhile, reviewed law and order with city police. There will be a metro bandh around Novotel‌, HICC. Drones were banned. There will be a public meeting on Sunday evening at the Parade Grounds. So the flyover will be closed from noon that day. SPG is set to take control of the surrounding buildings from Saturday.

Union Minister Kishan Reddy and Rajya Sabha member Laxman reviewed the arrangements for the public meeting to be attended by Prime Minister Modi. It is learned that Modi will hold a public meeting on the 3rd of this month. BJP leaders are setting up four stages for this assembly. Only seven people will be allowed on the stage where Modi is. Meanwhile, BJP leaders estimate that one lakh people will attend the meeting. BJP leaders have already made arrangements to evacuate the activists. Arrangements were made to cover the entire ground with a roof without difficulty if it rained. Also .. Entrance has been specially arranged for Modi, National Secretaries, Union Ministers and Chief Ministers. SPG, RAF and local police took control of the grounds in the wake of the meeting.

The failure of coordination in the arrangements for the BJP National Working Committee meetings is evident. Confusion prevailed at the HICC with a lack of coordination among leaders. Leaders raised their hands in the issuance of passes due to this inconsistency. Although the time for meetings is approaching .. BJP still has not given passes to anyone. Police stop BJP ranks coming to the meeting at the HICC main gate due to lack of passes. Another twist is that even the leaders in charge of meetings do not have passes. This caused confusion at the main gate of HICC.

Telugu Version

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నాలుగు అంచెల్లో భద్రతా కల్పిస్తున్నారు. ప్రధాని చుట్టూ SPGతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో నిఘా పెట్టారు. మోదీ వెళ్లే ప్రాంతాల్లో స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీలు నిఘా పెట్టాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నీ పరిశీలించింది ఎస్పీజీ. మరోవైపు లా అండ్ ఆర్డర్‌పై సిటీ పోలీసులతో SPG అధికారుల సమీక్ష చేశారు. నోవాటెల్‌, HICC చుట్టు మెట్రో బంద్ ఉంటుంది. డ్రోన్లపై ఆంక్షలు పెట్టారు. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఫ్లైఓర్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ చుట్టూ పక్కల ఉన్న భవనాలను శనివారం నుండి తమ ఆధీనంలో తీసుకోబోతోంది SPG.

ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పా్ట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పరిశీలించారు. ఈ నెల 3వ తేదీన మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ సభ కోసం నాలుగు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ నాయకులు. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి ఇవ్వనున్నారు. కాగా, సభకు పది లక్షల మంది సభకు హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా గ్రౌండ్స్ మొత్తం రూఫ్‌తో కవర్ చేస్తూ ఏర్పాట్లు చేశారు. అలాగే.. మోదీ, జాతీయ కార్యదర్శులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఎంట్రెన్స్ ఏర్పాటు చేశారు. ఇక సభ నేపథ్యంలో గ్రౌండ్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఎస్పీజీ, ఆర్ఏఎఫ్, లోకల్ పోలీసులు.

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లలో కో ఆర్డినేషన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపంతో హెచ్ఐసిసి వద్ద గందరగోళం నెలకొంది. ఈ సమన్వయలోపం కారణంగా పాసుల జారీలో చేతులు ఎత్తేశారు నేతలు. సమావేశాల సమయం సమీపిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఎవరికి పాసులు ఇవ్వలేదు బీజేపీ. పాసులు లేకపోవడంతో సమావేశానికి వస్తున్న బీజేపీ శ్రేణులను హెచ్ఐసిసి మెయిన్ గేటు వద్దే ఆపెస్తున్నారు పోలీసులు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. సమావేశాల బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు సైతం పాసులు లేవు. దీంతో హెచ్ఐసిసి మెయిన్ గేట్ వద్ద అయోమయం నెలకొంది. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens