హరిహర వీరమల్లు: ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఏఎం ర‌త్నం నుంచి గుడ్‌న్యూస్‌!

ముందుగా ప్రకటించినట్లుగానే మార్చి 28న 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తవుతోందని ఆయ‌న పేర్కొన్నారు.

ఏఎం రత్నం ఓ మీడియా ఛానల్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేస్తున్నాం, సినిమా సమయానికి విడుదల అవుతుంది, ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అన్నారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, చిత్ర యూనిట్ సినిమా సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టిందిరో' అనే రొమాంటిక్ పాటను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ పాట కోసం వేచి ఉన్నారు.

హరిహర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి చాలా భాగానికి దర్శకత్వం వహించారు, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయారు. మిగిలిన భాగానికి, నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఆస్కార్ విన్నర్ కీరవాణి అందిస్తున్నారు. ప‌వ‌న్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens