This study is a breath of fresh air for those who want to lose weight by fasting and drinking water. However, experts doubt that there will be no metabolic benefits if you do this for longer days. In particular, it is stated that no one should do these fasts for more than five days without the supervision of a doctor. This new paper recently revealed eight studies on water fasting, or Buchinger fasting. This fast is medically supervised.
This fasting process is popular in Europe. Here people consume only a small amount of juice and soup per day. Did some of the studies in the review regain the weight they lost after the fast ended? Or? Tracked that. In one of them people regained all that they had lost during a three-month five-day water fast. In two other studies only a small amount of the weight lost was regained. But those studies encouraged participants to restrict their calories after the fast ended.
Some studies included participants with type 1 and type 2 diabetes. They did not experience any ill effects from fasting, although they were closely monitored by experts. Also adjusted their insulin doses during fasting.
The most common side effects of these long fasts are those from intermittent fasting, including headaches, insomnia, and hunger. Studies have found no serious adverse effects such as metabolic acidosis or death. So if such fasts are done less frequently under the supervision of doctors, good results will be obtained.
Telugu version
ఉపవాసం చేస్తూ నీటిని తాగుతూ బరువు తగ్గుదామనుకునే వారికి ఈ అధ్యయనం ఊపరిపోసింది. అయితే ఇలా అధిక రోజులు చేస్తే జీవక్రియ ప్రయోజనాలు ఉండవని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఐదు రోజులకు మించి ఎవరూ ఈ ఉపవాసాలు చేయడకూడదని పేర్కొంటున్నారు. ఈ కొత్త పేపర్ వాటర్ ఫాస్టింగ్ లేదా బుచింగర్ ఫాస్టింగ్‌పై ఎనిమిది అధ్యయనాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఉపవాసాన్ని వైద్యపరంగా పర్యవేక్షిస్తారు. ఈ ఉపవాస ప్రక్రియ యూరోప్‌లో ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ ప్రజలు రోజుకు కొద్ది మొత్తంలో రసం, సూప్ మాత్రమే తీసుకుంటారు. సమీక్షలోని కొన్ని అధ్యయనాలు మాత్రమే ఉపవాసం ముగిసిన తర్వాత వారు కోల్పోయిన బరువును తిరిగి పొందారా? లేదా? అని ట్రాక్ చేశారు. వాటిలో ఒకదానిలో ప్రజలు మూడు నెలల్లో ఐదు రోజుల నీటి ఉపవాసంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందారు. మరో రెండు అధ్యయనాల్లో కోల్పోయిన బరువులో కొద్ది మొత్తం మాత్రమే తిరిగి వచ్చింఘి. కానీ ఆ అధ్యయనాలు ఉపవాసాలు ముగిసిన తర్వాత వారి క్యాలరీలను పరిమితం చేయమని పాల్గొనేవారిని ప్రోత్సహించాయి.
కొన్ని అధ్యయనాల్లో టైప్ 1, టైప్ 2 మధుమేహంతో పాల్గొనేవారు ఉన్నారు. వారు ఉపవాసం నుంచి ఎటువంటి చెడు ప్రభావాలను అనుభవించలేదు, అయినప్పటికీ వారిని నిపుణులు నిశితంగా పరిశీలించారు. అలాగే ఉపవాసం సమయంలో వారి ఇన్సులిన్ మోతాదులను సర్దుబాటు చేశారు.
ఈ సుదీర్ఘ ఉపవాసాల యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలు అడపాదడపా ఉపవాసం నుంచి వచ్చేవిగా ఉంటాయి, తలనొప్పి, నిద్రలేమి, ఆకలి వంటివి ఉన్నాయి. అధ్యయనాలలో జీవక్రియ అసిడోసిస్ లేదా మరణం వంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు లేవని కనుగొన్నారు. కాబట్టి ఇలాంటి ఉపవాసాలు వైద్యుల పర్యవేక్షణ మేరకు తక్కువ సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.