YS Jagan government once again gave good news to the students. Jagananna Vidya Deevena, which is provided by Andhra Pradesh government every year with the intention of providing support for the higher education of poor students . To this end, Chief Minister Jagan will visit NTR's district Tiruvuru.
In a program held there, he will press a button and deposit money into the accounts of mothers of students who are eligible for JVD. Actually, this money should be deposited in the mother's account on Saturday itself. However, the program was postponed to next day as the inter examinations were being held at the social welfare gurukula school located next to the Chief Minister's Sabha venue in Tiruvuru.
Telugu version
విద్యార్ధులకు వైయస్ జగన్ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగా ఆదివారం తల్లుల ఖాతాలో జమ కానున్నాయి.
ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి జేవీడీకి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు. వాస్తవానికి శనివారమే తల్లుల ఖాతాలో ఈ నగదు జమ కావల్సిఉంది. అయితే తిరువూరులోని ముఖ్యమంత్రి సభా వేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతోన్నందున.. కార్యక్రమాన్ని అదివారానికి వాయిదా వేశారు.