భయం
మనలో చాలా మంది కొన్ని విషయాలు మాట్లాడటానికి భయపడుతుంటారు. ఆ భయం మనల్ని ఎదగనివ్వధు.
భయపడుతూ మనం ఏది కూడా సాధించలేము . ఇక్కడ ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం . మనలో పాము అంటే చాలా మందికి భయం అనుకుందాం . పాము భయం ఎలా పోతుంది మరి ? ఇప్పుడు ఆ భయాన్ని ఎలా ఐనా పోగొట్టుకోవాలి . ఎలా పోగొట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారా ? మరి అంత ఆలోచించకండి ...ఏమి లేదు అండి. భయాన్ని పక్కన పెట్టి ఒక్కసారి పాము పక్కన నడిచి చూడండి . అప్పుడు మీకు తెలుస్తుంది... నేను భయపడినంత ఇక్కడ లేదు అని ...దీనికే ఇంతలా భయపడ్డానా అని , అంతే కదా ...అలాగే జీవితంలో మనం ఒకరికి భయపడినంత కాలం మనల్ని భయపడుతూనే ఉంటారు . కాబట్టి మీరు ఎవరికైతే భయపడుతున్నారో వాళ్ళ ముందుకు వెళ్ళి దైర్యంగా మాట్లాడండి. ఇక్కడ అందరూ ఒకటే ..కాబట్టి మీరు ఎవరికి భయపడాలిసిన అవసరం లేదు . మీకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి . ఒక విషయం గురించి చెప్పాలనుకున్నా చెప్పేయండి ...ఒకరు ఏదో అనుకుంటున్నారని కాదు ..మీ కోసం మీరు ఉండండి ..సమాజం అన్నాక ప్రతి చిన్న పనికి మనం చేసే పనిని వేలు పెట్టి చూపిస్తూనే ఉంటాది . అంత మాత్రాన మనం అక్కడే ఆగిపోవాలిసిన అవసరం లేదు . ఇక్కడ మనం ఆగిపోతున్నాం అంటే భయం వల్ల మాత్రమే . ఎప్పుడు భయం పెట్టుకొని కూడా బ్రతకడం కష్టం. దాన్ని మన జీవితం నుంచి ఎంత దూరం చేస్తే అంత మంచిది . ఇది మనం జీవితం అండి . మన జీవితంలో మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి అండి . ఒకరికి నచ్చినట్టు మనం బ్రతికితే అది మీ జీవితం ఎలా అవుతుంది అండి . జీవితం మనకు ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది. అప్పుడు భయంతో కాదు దైర్యంగా ఎదుర్కొండి. అప్పుడప్పుడు ప్రకృతితో మాట్లాడండి...ప్రకృతి ఇచ్చే ఓదార్పు ఎవరు కూడా ఇవ్వలేరు ? ఒకరిని పట్టించుకోకపోతే వాళ్ళు మనతో మాట్లాడరేమో అని భయపడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేరా ? కాబట్టి మీ జీవితాన్ని మీ చేతిలోనే ఉంచుకోండి . వేరే వాళ్ళకి అంకితం చేసినా, ఈ రోజుల్లో గుర్తించే వాళ్ళు అంటూ ఎవరు లేరు ?? కొంతమంది వాళ్ళ జీవితాల్ని కూడా వదిలేసి వేరే వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తా ఉంటారు . మరి మీ జీవితంలో పేజీలు ఎవరు తిప్పుతారు అండి . వాళ్ళ గురించి కాలం చూసుకుంటాదిలే కానీ కాలం కూడా మన జీవితంలో ఒక భాగంమని మర్చిపోతున్నారు. ఇది కూడా తెలుసుకోవాలి కదా అండి . కాలం చాలా విలువైనది . ఒక్కసారి పోతే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఆలోచించి అడుగు వేయండి.