Jasmine flowers are intoxicating with their fragrance. But..increased prices are making the consumer sweat. Due to the wedding season, the demand for jasmine flowers has increased. Their prices have gone up. There is a situation where the people are in a rush. In Ambedkar's Konaseema district, it's not just sunshine...the prices of jasmine flowers are sweating. In the wholesale market, the prices of a kg of jasmine flowers range from one thousand to 12 hundred rupees. With the huge increase in the prices of flowers, consumers are afraid to buy them.
Due to the wedding season, the demand for jasmine flowers is high and the prices of jasmine flowers have increased drastically. As the jasmine flower harvest has started and the harvest is not fully available yet, the prices have increased due to lack of supply to meet the demand. The price of jasmine flowers is 15 hundred per kg in the open market. As the flowers are available only in the summer season, they are very popular among the Maguvals. But if it becomes available in full, the traders say that the prices will decrease.
Telugu version
మల్లెపూలు సువాసనతో మత్తెక్కిస్తాయి. కానీ..పెరిగిన ధరలు వినియోగదారుడికి చెమటలు పట్టిస్తున్నాయి. పెళ్లీల సీజన్ కావడంతో మల్లెపూలకు గిరాకీ పెరిగింది. దాంతో వాటి ధరలు కొండెక్కాయి. కొందామంటేనే జనం హడలిపోయే పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండలే కాదు…మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ మల్లెపూల ధరలు వెయ్యి రూపాయల నుండి 12 వందలు పలుకుతున్నాయి. పూల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనాలంటేనే భయపడి పోతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో మల్లెపూలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మల్లెపూల ధరలు భారీగా పెరిగిపోయాయి. మల్లెపూల పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాకపోవడంతో డిమాండ్‌కి తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలు పలుకుతోంది. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు. ఐతే పూర్థిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారస్తులు.