Deepa Re Entry to Karthika Deepam Serial Star Maa | Karthika Deepam

Karthika Deepam serial remained at the top position on the screen for almost four years. In the field of television, many serials are competing. An important reason why this serial is so popular with the Telugu audience is Vanalakka. Impresses the family audience with his performance. She got many fans with her amazing acting. But the director ended the story of Deepa and Dr. Babu with a bomb blast. After that another story called New Generation was brought to the audience. However, after the end of Dr. Babu's story, Kartika Deepam serial fell to the second place in TRP rating.

It has to be said that the story brought by Saurya, Nirupam, Hima and Shobha is not impressing the audience that much. Karthikadeepam, who was at the top for almost four years, has now secured a place in the top 10. Vanalakka Premi Vishwanath recently gave good news to the fans of Kartika Deepam. She left the audience confused with the video she shared on her Instagram. She was seen wearing the same makeup as Deepa.. with a blob. In that video, a person was seen smiling saying that Deepa madam's shot is ready. Sharing this video. Kartikadeepam gave a hashtag saying coming.. for you. With this, fans are expressing happiness that Deepakka will re-enter Kartika Deepam again. Nice to see you again.. Welcome madam.. Super, is Dr. Babu coming? They are making comments. But now that the daughters of Vanalakka and Dr. Babu are grown up, Deepa's look has to change. But in the newly released promo, will Deepa really make a re-entry when she is seen in her old look? Expressing doubt. Let's see if Kartika will make noise again in the lamp? or ? is

Telugu Version

బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో ఏకపక్షంగా కొనసాగింది కార్తీక దీపం సీరియల్. టెలివిజన్ రంగంలో అనేక సీరియల్స్ పోటీగా వస్తున్నా.. చెక్కుచెదరకుండా రేటింగ్లో మొదటి స్థానంలో దూసుకుపోయింది. ఈ సీరియల్ ఇంతగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకోవడానికి కారణం ముఖ్యం కారణం వంటలక్క. తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో.. కంటిచూపుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే అనుహ్యంగా బాంబ్ బ్లాస్ అంటూ దీప, డాక్టర్ బాబుల కథకు ముగింపు పలికారు డైరెక్టర్. ఆ తర్వాత కొత్త జనరేషన్ అంటూ మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే వంటలక్క.. డాక్టర్ బాబు కథ ముగియడంతో కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్లో రెండవ స్థానంలోకి పడిపోయింది.

సౌర్య, నిరుపమ్, హిమ, శోభ అంటూ తీసుకువచ్చిన కథ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదనే చెప్పుకోవాలి. దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో నిలిచిన కార్తీకదీపం ఇప్పుడు టాప్ 10లో ఓ స్థానాన్ని సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కార్తీక దీపం అభిమానులకు శుభవార్త చెప్పింది వంటలక్క ప్రేమీ విశ్వనాథ్. తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోతో ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. మునుపటి దీపగా అదే కట్టు.. బొట్టుతో మేకప్ అయ్యి కనిపించింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి దీప మేడమ్ షాట్ రెడీ అనగా.. వస్తున్నా అంటూ నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ. వస్తున్నా.. మీ కోసం అంటూ కార్తీకదీపం హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో దీపక్క మళ్లీ కార్తీక దీపంలోకి రీఎంట్రీ ఇస్తుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మిమ్మల్ని మళ్లీ చూడడం సంతోషంగా ఉంది.. వెల్ కమ్ మేడమ్.. సూపర్, డాక్టర్ బాబు వస్తున్నాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబుల కూతుర్లు పెద్దవారు కావడంతో దీప లుక్ మారాల్సి ఉంది. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో వంటలక్క ఓల్డ్ లుక్లో కనిపించేసరికి నిజంగానే దీప మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి కార్తీక దీపంలో మళ్లీ వంటలక్క సందడి చేయనుందా ? లేదా ? అనేది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens