Director Venu, who came to know about Mogiliah's condition, came forward to help them. Komuravva in Duggondi, Warangal district went to Mogilaiah's house and handed over Rs. Moreover, Mogiliah assured the couple that he will talk to the producer Dilraj and ensure that they get more financial support. He also said that he will talk to the government and take steps to provide free medicines along with medical aid. On this occasion, Director Venu along with his friendly team honored Komuravva and Mogilaya.
Local leaders, lyricist Kasarla Shyam and anchor Geetha Bhagat gave 70 thousand rupees to the Mogilaya couple. Another 30 thousand rupees were deposited in his bank account. After that he had lunch with them. On the way, Mogilaya gave courage to the couple. Venu gained recognition as a good director with the movie Balagam. He also brought to light many artists like Mogilaya who were falling into obscurity. Now their family gets Rs. Fans and netizens are showering praises on Venu as he has once again shown his great heart by providing lakhs of aid.
Telugu version
మొగిలయ్య దీన పరిస్థితి గురించి తెలుసుకున్న డైరెక్టర్ వేణు వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. వరంగల్ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్య ఇంటికి వెళ్లి రూ.లక్ష ఆర్థికసాయంగా అందజేశారు. అంతేకాదు నిర్మాత దిల్రాజ్తో మాట్లాడి మరింత ఆర్థికసాయం అందేలా చూస్తానని మొగిలయ్య దంపతులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సాయంతో పాటు ఉచితంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా కొమురవ్వ, మొగిలయ్యలను డైరెక్టర్ వేణు తన మిత్ర బృందంతో కలిసి ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు, గేయ రచయిత కాసర్ల శ్యామ్, యాంకర్ గీత భగత్ కలిసి మొగిలయ్య దంపతులకు 70 వేల రూపాయలు అందించారు. మరో 30 వేల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. వెళ్లేటప్పుడు మొగిలయ్య దంపతులకు ధైర్యం చెప్పారు.
బలగం సినిమాతో మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అలాగే మరుగున పడిపోతున్న మొగిలయ్య లాంటి ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు వారి కుటుంబానికి రూ. లక్ష సాయం అందించి వేణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడని అభిమానులు, నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.