Cyclone Mocha is turning into a big storm Red alert for those states

The threat of Cyclone Mocha is looming. IMD informed that Mocha, a severe cyclone formed in South-East Bay of Bengal, has turned into a cyclonic storm and is moving in a north-northwest direction. The Meteorological Department has warned that the impact of Cyclone Mocha will be severe on the northeastern states. The Indian Meteorological Department has announced that heavy rains will occur in the northeastern states under the influence of Cyclone Mokha. Heavy rains will be recorded in Andaman and Nicobar Islands under the influence of Cyclone Mocha.

 However, the IMD has revealed that the threat of a cyclone to the coasts of Andhra Pradesh and Odisha has passed. Cyclone Mocha will cross the Bangladesh-Myanmar border on the 14th of this month. The Indian Meteorological Department has warned that there is a risk of strong gales blowing at a speed of 150 to 175 km while crossing the coast.


After that, the cyclone will weaken and affect Tripura, Mizoram to Manipur, South Assam and Nagaland. IMD has warned that heavy rains will fall in the respective states till 14th of this month. Gusty winds will also affect Tripura, Mizoram and South Manipur. Meteorological department officials have issued a warning to the fishermen in the storm-affected areas not to go hunting in the sea under any circumstances. People are advised to move to safe places as weak structures and Puri huts are likely to be damaged. After that the cyclone will weaken and will affect Tripura, Mizoram to Manipur, South Assam and Nagaland. IMD has warned that heavy rains will fall in the respective states till 14th of this month. Gusty winds will also affect Tripura, Mizoram and South Manipur. Meteorological department officials have issued a warning to the fishermen in the storm-affected areas not to go hunting in the sea under any circumstances. People are advised to move to safer areas as weak structures and Puri huts are likely to be damaged.

Southeast Bay of Bengal and Andaman Sea will become turbulent due to the storm. The Meteorological Department has announced strong gusty winds with a maximum speed of 120 km per hour. On the other hand, along with the Konkan coast, Kerala and Tamil Nadu will have very hot weather for the next 5 days. India Meteorological Department announced that the effect of heat wave will be severe in the states of Gujarat, Madhya Maharashtra, Bihar, West Bengal as well as Rajasthan, Coastal Andhra and Yanam. It has been announced that this situation will continue till 15th of this month.

Telugu version

మోచా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మోచా తుఫానుగా మారి, ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మోచా తుఫాను ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో మోఖా తుఫాను ప్రభావంతో భీకర వర్షాలు కురుస్తాయని ఇండియన్‌ మెట్రొలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. మోచా తుఫాను ప్రభావంతో అండమాన్‌ నికోబార్ దీవుల్లో తీవ్ర వర్షపాతం నమోదవనుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరాలకు తుఫాను ముప్పు తప్పినట్టేనని ఐఎండీ వెల్లడించింది. మోచా తుఫాను ఈనెల 14 వ తేదీన బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లో తీరాన్ని దాటనుంది. తీరం దాటే సమయంలో 150 నుంచి 175 కి.మీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఇండియన్‌ మెట్రొలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది.

ఆ తరువాత తుఫాను బలహీనపడుతూ త్రిపుర, మిజోరాం మీదుగా మణిపూర్‌, దక్షిణ అస్సాం, నాగాలాండ్‌ వరకు మోఖా తుఫాను ప్రభావం చూపనుంది. దీంతో ఈనెల 14 వరకు ఆయా రాష్ట్రాల్లో భీకర వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. త్రిపుర, మిజోరాం, దక్షిణ మణిపూర్‌పై కూడా ఈదురు గాలుల ప్రభావం ఉండనుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు. బలహీన నిర్మాణాలు, పూరి గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు.

తుఫాను కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు కొంకణ్ తీరంతో పాటు కేరళ, తమిళనాడులలో రానున్న 5 రోజుల పాటు వాతావరణం తీవ్ర ఉక్కపోతగా ఉండనుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, కోస్తా ఆంధ్రా, యానాం ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens