English Version
There is good news for the customers about the service charges charged at the restaurant. The government has taken a decision to shock restaurants and hotels. The Central Consumer Protection Authority (CCPA) on Monday ruled that service charge should not be levied by default on food bills. It said that these should not be charged service fee under other names. It also suggests telling the customer that this is completely optional. Under no circumstances should service charge be added to the food bill, nor should GST be levied on it. However, it is known that there has been a dispute regarding service charges recently. Taking a public stand, the government has asked the hotels and restaurants what are the rules for taking service charge and how much they are charging for it. Later, a meeting was also held with the hotels. Finally, the government has taken a step forward in the matter of service charges.
In the first meeting held with the National Restaurant Association of India (NRAI), the Department of Consumer Affairs (DOCA) of the central government asked not to levy service charge. The government has brought new regulations on this. No more service charges can be levied on food bills.
What is in the order?
The government order states that hotels or restaurants should not combine the service charge with the food bill and not charge GST on the amount. It states that the service charge cannot be collected from the customer by changing the name of hotel or restaurant service charges or by any other name. At present, no separate money can be taken from customers in the name of service. The CCPA said that if the money is collected without following these rules, a complaint can be lodged on the National Consumer Helpline number 1915.
Telugu Version
రెస్టారెంట్‌లో వసూలు చేసే సర్వీస్ ఛార్జ్‌ల గురించి కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. రెస్టారెంట్, హోటళ్లకు షాకిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించకూడదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం తీర్పు వెల్లడించింది. వీటిని ఇతర పేర్లతోనూ సేవా రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. అలాగే ఇది పూర్తిగా ఐచ్ఛికమని కస్టమర్‌కు చెప్పాలని సూచించింది. ఆహార బిల్లుకు సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో జోడించకూడదు, దానిపై GST కూడా విధించకూడదని పేర్కొంది. కాగా, సర్వీస్ ఛార్జీల విషయంలో ఇటీవల వివాదం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. పబ్లిక్ స్టాండ్ తీసుకొన్న ప్రభుత్వం.. హోటల్స్, రెస్టారెంట్‌లను సర్వీస్ ఛార్జ్ తీసుకోవడానికి నిబంధనలు ఏంటి, దానికి ఎంత వసూలు చేస్తున్నారంటూ అడిగింది. అనంతరం హోటళ్లతో సమావేశం కూడా నిర్వహించారు. చివరకు సర్వీస్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ)తో నిర్వహించిన తొలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం (డీఓసీఏ) సర్వీస్ ఛార్జీ విధించవద్దని కోరింది. ఈమేరకు ప్రభుత్వం దీనిపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఫుడ్ బిల్లులపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు వసూళ్లు చేయలేరు.
ఆర్డర్‌లో ఏముందంటే?
హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని ఫుడ్ బిల్లుతో కలపకూడదని, ఆ మొత్తానికి జీఎస్టీని వసూలు చేయకూడదని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీలను పేరు మార్చడం ద్వారా లేదా మరేదైనా పేరుతో కస్టమర్ నుంచి సర్వీస్ ఛార్జీని వసూలు చేయలేరని అందులో పేర్కొంది. ప్రస్తుతం సర్వీస్ పేరుతో కస్టమర్ల నుంచి విచ్చల విడిగా డబ్బులు తీసుకోలేరు. ఒకవేళ ఈ రూల్స్ పాటించకుండా డుబ్బు వసూళ్లు చేస్తే, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915లో ఫిర్యాదు చేయవచ్చని CCPA తెలిపింది.