With Infosys.. office opening in port city.. IT employees are excited for once.. Infosys in Visakhapatnam in next two monthsIndustries and Commerce Minister Gudivada Amarnath revealed that the activities will be started. Infosys will open the office with a capacity of 1,000 employees, he said. He said that most of the employees working in IT companies are from Andhra Pradesh.
Out of every hundred IT employees in the country, 15 are Telugus. He said that five of them are from Telangana and ten from Andhra Pradesh. He said that Visakhapatnam, which is already progressing economically, will be a pioneer in IT. In the past three and a half years, the state has spent Rs. He said that permission has been granted for investments worth 1.9 lakh crores. Srijana Gummalla, Director of Industries and Commerce Department, L. Sridhar Reddy, CEO of AP Economic Development Board participated in this meeting.
Telugu version
పోర్ట్ సిటీలో ఇన్ఫోసిస్.. ఆఫీస్ ఓపెనింగ్.. తో ఒక్క సారిగా ఐటీ ఎంప్లాయిస్ లో జోష్ మొదలైంది.. మరో రెండు నెలల్లో విశాఖ పట్టణంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ వెయ్యిమంది ఉద్యోగుల సామర్థ్యంతో కార్యాలయాన్ని ప్రారంభించనుందని తెలిపారు.
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారన్నారు. దేశంలోని ప్రతి వందమంది ఐటీ ఉద్యోగుల్లో 15 మంది తెలుగువారు ఉన్నారని. వీరిలో ఐదుగురు తెలంగాణ, పది మంది ఆంధ్రప్రదేశ్ వాసులున్నారని తెలిపారు. ఇప్పటికే పారివ్రామికంగా ప్రగతి సాధిస్తున్న విశాఖపట్టణం ఐటీలోనూ అగ్రగామి కానుందన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రం రూ. 1.9 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ల, ఏపీ అర్థిక అభివృద్ధి మండలి సీఈఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితురులు పాల్గొన్నారు.