Bhagavad Gita Super Memorial Test at Samatha Kshetra.

But.. in Samata Kshetra, the students have abused the Bhagavad Gita. Just say the chapter number. They are reciting the entire hymn. If one thousand slokas are recited.. in which chapter it is, many slokas are said to be too much. It is enough to say the first letter of the Shloka.. the whole Shloka is said.

 In the Bhagavad Gita Super Memorial Test conducted under the supervision of Sri Chinna Jeeyar Swamy, the Vedic students seemed to be at a loss. Bhagavad Gita was chewed like water. These children, who are not even ten years old, recited Bhagavad Gita verses. Not only the devotees but also the priest Brahmas were shocked by the answers given by the children in a pinch. Amazed by the children's talent.. watched.

As part of Samata Kumbh Brahmotsavam, Bhagavad Gita Super Memorial Test was conducted on the seventh day afternoon. Vedic students and Prajna students participated in the test which was conducted under the supervision of Sri Chinna Jeeyar Swami. Prajna is a specialized training center run by Chinna Jeyar Swamy. Bhagavad Gita hymns are taught to the students in this center from an early age.

 Bhagavad Gita is taught not only to students in India, but also to students in America, Australia, Canada, Singapore and Malaysia. 45 students from America participated in the test held yesterday. Along with them students of Vedic school also participated.

Telugu version

కానీ.. సమతా క్షేత్రంలో విద్యార్థులు భగవద్గీతను అవపోసన పట్టారు. అధ్యాయం నంబర్ చెప్తే చాలు. శ్లోకం మొత్తాన్ని టపటపా చెప్పేస్తున్నారు. ఒక వేల శ్లోకం చెప్తే.. అది ఏ అధ్యాయంలో, ఎన్నో శ్లోకమనేది టపీమని చెప్పేస్తున్నారు. శ్లోకంలో మొదటి అక్షరాన్ని చెప్తే చాలు.. శ్లోకం మొత్తాన్ని చెప్తున్నారు. 

శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్‌లో.. వేద విద్యార్థులు అదరహో అనిపించారు. భగవద్గీతను నీళ్లు నమిలినట్టు నమిలేశారు. పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఈ చిన్నారులు.. భగవద్గీత శ్లోకాలను అవపోసన పట్టేశారు. చిన్నారులు చిటికెలో ఇస్తున్న సమాధానాలకు.. భక్తులే కాదు.. అర్చక బ్రహ్మలు సైతం నివ్వెరపోయారు. పిల్లల ట్యాలెంట్‌కి విస్తుపోయి.. వీక్షించారు.

సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏడో రోజు మధ్యాహ్నం వేదికపై భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్ నిర్వహించారు. శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన టెస్ట్‌లో వేద విద్యార్థులు, ప్రజ్ఞ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజ్ఞ అనేది చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కేంద్రం.

 ఈ కేంద్రంలో స్టూడెంట్స్ కి చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తున్నారు. కేవలం ఇండియాలో ఉన్న విద్యార్థులకే కాదు .. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా ప్రాంత విద్యార్ధులకు కూడా భగవద్గీతను నేర్పిస్తున్నారు. నిన్న జరిగిన టెస్ట్‌లో అమెరికాకు చెందిన 45మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు వేద పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens