Are you suffering from bad breath?

It's okay for anyone.. When you wake up in the morning, your mouth smells bad. After brushing, the whole mouth is also fresh. But some have medical conditions. Or frequent bad breath due to other reasons. Because of this they cannot talk to anyone properly. It will be difficult to get out. But if the cause of this problem is known.. then the solution can be found.

 Also bad breathThe main reason is lack of saliva in the mouth. When we sleep at night, the production of saliva in the mouth decreases. This makes the mouth dry. This saliva usually flushes out odor-causing particles.

 As the production of saliva decreases during sleep, the bacteria in the mouth increases and you feel bad breath in the morning. To check this problem, brush first when you wake up. Sometimes bad breath persists even after brushing. Bad breath depends on a person's health conditions, dietary habits, and oral care practices. Now let us know what are the precautions to be taken in this background..

Cloves: Cloves  are mostly used in cooking. They have a nice pungent flavor. These can be used as an antidote to bad breath. It has antibacterial properties. It removes the bacteria in the mouth. Also, if there is no bleeding from the tooth or other dental problems, the problem will be removed. Just put a clove in your mouth and chew it.

Telugu Version

ఎవరికైనా సరే.. ఉదయం లేవగానే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. బ్రష్‌ వేయగానే నోరంతా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ కొంతమందికి అనారోగ్య పరిస్థితులు. లేదా ఇతర కారణాల వల్ల తరచుగా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు. బయటికి రావాలంటే ఇబ్బందిపడుతారు. అయితే ఈ సమస్యకు కారణం తెలుసుకుంటే.. పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. అలాగే ఇలా నోటి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం.. నోటిలో లాలాజలం లేకపోవడమే. మనం రాత్రి పడుకున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది.

 దీంతో నోరు పొడిబారుతుంది. ఈ లాలాజలం సాధారణంగా దుర్వాసన కలిగించే కణాలను బయటకు పంపుతుంది. నిద్రిస్తున్న సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవటంతో నోటిలో బాక్టీరియా పెరిగిపోయి ఉదయం పూట దుర్వాసనగా అనిపిస్తుంది. ఈసమస్యకు చెక్ పెట్టేందుకు లేవగానే మొదట బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నప్పటికీ కొన్ని సార్లు నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. నోటి దుర్వాసన అనేది వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, నోటి సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..లవంగాలు: లవంగాలను ఎక్కువగా వంటలలో వాడుతారు.

 ఇవి చక్కటి ఘాటు ఫ్లేవర్‌ని కలిగి ఉంటాయి. వీటిని నోటి దుర్వాసనకి విరుగుడుగా వాడవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలానే పంటి నుండి రక్తం కారడం లేదంటే ఇతర పంటి సమస్యలు ఉన్నా సరే సమస్య తొలగిపోతాయి. మీరు నోట్లో లవంగాలని వేసుకొని నమిలితే సరిపోతుంది.

తేనె: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కొద్దిగా దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే దుర్వాసన వెంటనే మాయం అవుతుంది. ఈ రెండిట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. తేనె, దాల్చిన పేస్ట్‌ని నోటికి అప్లై చేసినట్లయితే దంత సమస్యలు తగ్గిపోతాయి. అలానే దంతాల నుంచి రక్తం కారడం దుర్వాసన వంటి సమస్యలు కూడా ఉండవు.

ఆహార నియమాలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కహాల్ వంటివి నోటి దుర్వాసనను పెంచుతాయి. నోటి దుర్వాసనను అధిగమించాలని అనుకుంటే ఈ రకమైన ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ వీటిని తినకుండా ఉండలేకపోతే వీటికి ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి.

కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి: నోటి దుర్వాసనను నివారించాలనుకునే వారు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి సమయాల్లో పడుకోవడానికి విశ్రమించేటప్పుడు దంతాలను బ్రష్ చేయటానికి ప్రయత్నించాలి. ఇప్పటికే రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ నోటి దుర్వాసన సమస్యను అనుభవిస్తుంటే, అలాంటి సందర్భంలో రోజుకు కనీసం ఒకసారైనా మౌత్ వాష్ లేదా ఫ్లాసింగ్ చేసుకోవాలి.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens