TTD will release the June month quota for Tirumala Srivari Arjita Seva tickets online on March 23 at 10 am. These include Kalyanotsavam, Oonjal Seva, Arjita Brahmotsavam and Sahasradipalankara Seva.
Similarly, the online LuckyDip registration process for remaining Arjitaseva tickets for the month of June will start on March 24 at 11 AM. Those who got tickets in LuckyDip have to pay and confirm.
Circumcision Tokens:
TTD will release the Angapradakshinam Tokens quota for the month of June online on March 24 at 10 AM.
Vision Quota for Elderly and Disabled:
TTD will release the quota of free special darshanam tokens for the month of April at 3 pm on March 24th to enable the elderly, disabled and chronically ill people to visit Tirumala Srivara. The TTD staff requested the devotees of Srivari to book their tickets after observing the respective services.
Telugu version
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు:
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా:
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు ఆయా సేవలను గమనించి తమ టికెట్లను బుక్ చేయసుకోవాలని టీటీడీ సిబ్బంది కోరింది.