మనుషుల్లో కొంత మందికి మాత్రమే మంచి మనస్సు ఉంటుంది. కొంత మంది అని ఎందుకు అన్నాను అంటే ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. మీ స్నేహితుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. మంచి మనస్సు ఉన్న స్నేహితులు . మనము ఎవరికైనా మంచి చేస్తే మనకి కూడా చేస్తారు. మనము మంచే చేయకుండా మనకి ఎవరు చేస్తారు అండి. మనము బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు మనం పిలవకపోయిన వచ్చి ఏమైంది అని అడుగుతారు. మనము అన్ని చేసిన వాళ్ళకి ఒక్కసారి కూడా తిరిగి చూడరు.
సాయం అందరు చేయరు. వాళ్ళకి ఒక సంఘటన బలంగా తాకినప్పుడు మాత్రమే చేస్తారు. ఇది ఎవరో చెప్తే కూడా చేసేది కాదు. మనిషికి అనిపించి చేయాలి .ఒక మనిషిని మంచి మనస్సుతో కొలవచ్చు. జీవితం ఎప్పుడు మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాది. మనము తట్టుకొని ముందుకు వెళ్ళడమే నేర్చుకోవాలి. మన మనస్సుని మంచి కోసమే తలవండి. అంతా మంచిగానే ఉంటుంది. ఈ రోజుల్లో మనస్సు ఉన్న మనుషులు దొరకడం చాలా కష్టం.
మనుషులకు, ఈ రోజుల్లో విపరీతంగా స్వార్ధం పెరిగిపోయింది. నా అని లేదు, మన అని లేదు, ఎవరని లేరని అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు అలా ఉన్నప్పుడు మీరు కూడా అలా ఉండటంలో తప్పు లేదు. ఒక మనిషికి మీరు చేసింది నచ్చటలేదు అంటే అక్కడ తప్పు మీది కాదు. వాళ్ళది. మీరు చేసింది నచ్చక కాదు. మీరే నచ్చటలేదని?? అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ గురించి బాధ పడటం అనవసరం . కాబట్టి మీతో ఉండే వాళ్ళనే మీ వాళ్ళగా చూడండి. మంచి మనస్సును ఎదుటి మనిషిలో కూడా చూడటం నేర్చుకోవాలి.