Jana Sena is stepping up with a new strategy. As a part of this, Janasena is ready for Chalo Vissannapet. The party leaders who accepted AP Minister Amarnath's challenge will go to Wissannapet soon. The party leaders alleged that the minister has 600 acres of land there.
What are the challenges? What is Janasena's strategy? What is the truth behind the allegations? The Janasena leaders are alleging that AP Minister Amarnath along with two other persons seized the survey number 195/2 of Bayyavaram revenue range of Anakapalli Constituency Kashinkota Mandal.
The controversy became a hot topic when Janasena President Pawan Kalyan questioned in the House that the minister has 600 acres of land, but the youth should get a job for Rs 5,000.
Minister Amarnath is strongly countering these allegations. 600 acres? Tell me where it is, tell me which paper to sign, and if there is, let them take it, he answered the questions of the media.
Janasena leaders say tell us what center we are ready to prove. Anakapalli Constituency, Kashimpet Mandal, Bayyaram Revenue Range, Survey No. 195/2. Janasena leaders have come forward with details.
On the one hand political criticism and on the other hand the Janasena program alerted the police. Keeping an eye on the movements of the leaders.
Telugu version
జనసేన సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఛలో విస్సన్నపేటకు సిద్ధమైంది జనసేన. ఏపీ మంత్రి అమర్నాథ్ సవాల్ ను స్వీకరించిన ఆ పార్టీ నేతలు.. కాపేపట్లో విస్సన్నపేట వెళ్లనున్నారు. అక్కడ మంత్రికి 600 ఎకరాల భూమి ఉందనేది ఆ పార్టీ నేతల ఆరోపణ.
సవాళ్లేంటి? జనసేన వ్యూహమేంటి? ఆరోపణల వెనుకున్న నిజాలేంటి? అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 195/2లో ఏపీ మంత్రి అమర్నాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కబ్జా చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రికి 600 ఎకరాల భూమి ఉంది, యువకులు మాత్రం 5 వేల రూపాయలకు ఉద్యోగం చేయాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సభలో ప్రశ్నించడంతో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మంత్రి అమర్నాథ్. 600 ఎకరాలా? ఎక్కడ ఉందో చెప్పండి, ఏ పేపర్ పై సంతకం పెట్టాలో చెప్పండి, ఉంటే వారినే తీసుకోమనండి అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నిరూపించేందుకు మేం సిద్ధం ఏం సెంటరో చెప్పండి అంటున్నారు జనసేన నాయకులు. అనకాపల్లి నియోజకవర్గం, కశింపేట మండలం, బయ్యారం రెవెన్యూ పరిధి, సర్వే నెంబర్ 195/2. వివరాలతో సహా ముందుకు వచ్చారు జనసేన నేతలు.
ఓ వైపు రాజకీయ విమర్శలు, మరో వైపు జనసేన ప్రోగ్రాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేతల కదలికలపై కన్నేసి ఉంచారు.