Marriage is very important in everyone's life. They want to celebrate the wedding as grand as possible. They make marriage arrangements according to their affordability. Marriage is like a celebration for the relatives of the bride and groom. Wedding ceremonies are celebrated with great pomp. But what happens if a very happy marriage suddenly stops? Recently a similar incident happened in Hyderabad.
There are many reasons why a failed marriage ends unexpectedly. But in the old basti of Hyderabad, a groom refused to marry for a strange reason. If we go into the details... a person named Mohammad Zakria near Chandrayanagutta in Hyderabad got married on Sunday. But when the time of marriage was approaching, Zakria refused to marry when he found out that the bride's relatives had given him a second-hand bed.
The girl's father filed a complaint at the Chandrayanagutta police station. The police immediately intervened and convinced Zakrin to get married. The young man also gave the green signal to get married. But here is another twist.. The bride decides that there is no point in marrying a man who refuses to marry for a small reason. With this, the story of this marriage has become another angle turn.
Telugu version
ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని ఆశపడే పెళ్లిని వీలైనంత గ్రాండ్‌గా జరుపుకోవాలని భావిస్తుంటారు. తమ స్థోమతకు తగ్గట్లు వివాహ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక వధూవరుల బంధువలకు కూడా పెళ్లి అనేది ఒక వేడుకలాంటిది. ఎంతో సంబురంగా పెళ్లి వేడుకలను జరుపుతుంటారు. అయితే ఎంతో సంతోషంగా సాగే పెళ్లి ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఏంటి.? తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది.
పీటల మీదికి వచ్చిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ హైదరాబాద్ పాత బస్తీలో ఓ వరుడు వింత కారణంతో పెళ్లికి నిరాకరించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట సమీపంలో ఉన్న మహమ్మద్ జాక్రియా అనే వ్యక్తికి ఆదివారం వివాహం కుదిరింది. అయితే వివాహ సమయం దగ్గరపడుతోన్న తరుణంలో వధువు బంధువులు తనకు సెకండ్ హ్యాండ్ మంచాన్ని పెట్టారని తెలుసుకున్న జాక్రియా పెళ్లికి నిరాకించాడు.
దీంతో యువతి తండ్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జాక్రిన్‌ను పెళ్లికి ఒప్పించారు. యువకుడు కూడా పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. చిన్న కారణంతో పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని వధువు తేల్చి చెప్పింది. దీంతో ఈ పెళ్లి కథ మరో యాంగిల్ టర్న్ అయ్యింది.