Stray dogs who took usura.. mob attack on a child.. with serious injuries.

He left the village and his relatives for employment and came to Bhagyanagar with his wife and children. He is supporting his family by doing whatever work he can find. The father who took the holiday with him was left with grief. While the child was playing, stray dogs chased and brutally attacked him.

 The boy was seriously injured in this incident. When he was taken to the hospital for treatment, the doctors said that he was already dead. Gangadhar, who hails from Indalwai in Nizamabad district, came to Hyderabad four years ago for employment. He supports his family by working as a watchman in a car service center. He resides in Bagh Amberpet with his wife and two children.

As Sunday was a holiday, he took the children to his place of work. He left the children there and engaged in work. Son Pradeep, who played there for a while, was followed by stray dogs while walking towards the cabin for his elder sister. The boy ran to escape from what he was afraid of. But they did not leave. They attacked the boy one after the other. The boy was seriously injured as his legs and arms were dragged.

The boy's sister, who was immediately alerted, ran and informed the father. He came and chased away the dogs. The seriously injured son was taken to a private hospital by the father. The doctors confirmed that the boy had already died.

Telugu version

ఉపాధి కోసం ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలేసి.. భార్యా పిల్లలతో కలిసి భాగ్యనగరానికి వచ్చాడు. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెలవు రోజు సరదాగా.. తనతో పాటు తీసుకెళ్లిన ఆ తండ్రికి పుత్రశోకం మిగిలింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి క్రూరంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి కి చెందిన గంగాధర్‌.. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో పిల్లలను తాను పనిచేసే చోటుకి తీసుకెళ్లాడు. చిన్నారులను అక్కడ వదిలేసి పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపు అక్కడ ఆడుకున్న కుమారుడు ప్రదీప్‌.. తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో బాలుడు భయపడిన వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి వదలలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అలర్ట్ అయిన బాలుడి సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. ఆయన వచ్చి కుక్కలను తరిమేశాడు. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens