The Monetary Policy Committee meeting of Reserve Bank of India is going on for three days. The meeting continued for the third day on Wednesday. On this occasion, RBI Governor Shaktikanta Das announced that the reporting rate will be increased. It has been clarified that the rate is being increased by 25 basis points.
It increased the repo rate from 6.25 to 6.50 percent. The GDP growth rate for April-June 2023 is estimated at 7.8 percent. Due to increase in this ratio, the interest rates on bank loans will increase.
Banks borrow from RBI. So the rate charged by banks when they take loans from RBI is called repo rate. It is also known as short term interest rate. The repo rate is determined keeping in mind the economic situation in the country in the short term. If the repo rate is reduced, the banks will get less loans. With this effect, commercial banks will be able to reduce the interest rate of loans to companies and individuals.
Telugu version
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రెపోరేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 25 వేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచింది. 2023 ఏప్రిల్-జూన్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా. ఈ రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటునను తగ్గిస్తే బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది.