Nominations of MLCs started in AP.

The MLC nominations season has started in AP. There was a political buzz with the nominations of the candidates. Even before the campaign season, accusations and counter-accusations are heating up between the parties. MLC nominations of Uttarandhra graduates in Visakha are in full swing. Minister Botsa Narayana and YV Subbareddy participated in the nomination program of YCP candidate Seethamraju Sudhakar. 

Achchennaidu and Ashok Gajapathi Raju came to support TDP candidate Chiranjeevi. On the other hand, state president of the party Somu Veerraju is with Asatham in the nomination of BJP candidate Madhav.

In Anantapur, YCP candidates Vennapusa Ravindra Reddy and Mangamma have filed their nominations. Minister Peddireddy said that YCP will support Teacher's MLC candidate Ramanchandra Reddy. He said that the party will work for the success of the three. In Chittoor district, seven nominations have been filed for the post of graduates and one for the posts of teachers. Not a single nomination has been received for the local body quota seat. There are YCP, TDP and PDF candidates in the constituency.

On behalf of YCP, Ramasubbareddy nominated as MLC candidate of Kadapa local bodies. Two sets of nomination papers are given to the Returning Officer. He thanked Jagan for giving him the opportunity to become an MLC candidate. TDP and BJP do not have the numerical strength.. He expressed confidence that his election is unanimous.

Telugu version

ఏపీలో ఎమ్మెల్సీల నామినేషన్ల పర్వం మొదలైంది. అభ్యర్థుల నామినేషన్లతో రాజకీయ సందడి కనిపించింది. ప్రచార పర్వానికి ముందే పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హీటెక్కిస్తున్నాయి. విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల కోలాహలం అంబరాన్నంటింది. మంత్రి బొత్స నారాయణ, వైవీ సుబ్బారెడ్డిలు.. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అటు టీడీపీ అభ్యర్థి చిరంజీవికి మద్దతుగా తరలివచ్చారు అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు. మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవ్‌ నామినేషన్‌లో.. ఆసాతం వెంట ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.అనంతపురంలో వైసీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, మంగమ్మ నామినేషన్ వేశారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రామంచంద్రారెడ్డికి వైసీపీ మద్దతు ఉంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ముగ్గురి విజయానికి పార్టీ కృషి చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల స్థానానికి ఏడు.. ఉపాధ్యాయ స్థానాలకి ఒక నామినేషన్‌ దాఖలైంది. స్థానిక సంస్థల కోటా స్థానానికి ఒక్క నామినేషన్ కూడా పడలేదు. బరిలో మాత్రం వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులు ఉన్నారు.

వైసీపీ తరపున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి నామినేషన్‌ వేశారు. రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారాయన. టీడీపీ, బీజేపీలకు సంఖ్యాబలం లేదని.. తన ఎన్నిక ఏకగ్రీవం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens