ఆశ !! అదృష్టం !!!
మన జీవితం ఆశ, అదృష్టానికి మధ్య తిరుగుతూ ఉంటుంది. మనము ఆశ పడతాం. కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. ఇంకా చెప్పాలి అంటే కొంత మంది కులాలు , మతాలు కోసం కొట్టుకుంటూ , తిట్టుకుంటూ ఉంటారు. అస్సలు మనకి ఉండేదే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితానికి కులాలు, మతాలతో పెట్టుకోవడం అవసరమా ??వాటితో పెట్టుకొని ఏమి సాధించగలము ?? ఏమైన సాధించగలమా ?? ఏ ఒక్కటి కూడా సాధించ లేము. ఉదాహరణకు చెప్పాలంటే మన కులం వాళ్లే మనకి స్నేహితులు అవ్వాలనేది ఆశ.
మనము కోరుకున్న స్నేహితులు మన జీవితంలోకి రావడం అనేది అదృష్టం. మనము చేసే చిన్న తప్పు ఏంటో తెలుసా !! మనకి దగ్గరలో ఉన్నవి మనము అందుకోవడానికి ట్రై చేయము. మనకి అందని వాటి కోసం మన జీవితాన్ని కూడా పక్కకి నెట్టేసి వేచి చూస్తా ఉంటాము. సాధించేవి పక్కకి నెట్టి , సాధించ లేని వాటితో పెట్టుకోవడం అంత అవసరమా మిత్రమా !!!ఒక్కసారి ఆలోచించు. కాలం నీ చేతుల్లో ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉండదు కదా. నీ జీవితానికి నువ్వే అన్ని. అది మాత్రం మర్చిపోకు.Life