Kannavar refused and threw him in a dirty canal.. A foreign couple adopted and admitted him.

A child born in a dirty canal.. A child is found in a garbage heap.. We hear such news all the time somewhere. Such heartbreaking incidents happen because of those who find it difficult to have children for their own sake. In the end, those children become victims in this drama played by humans. But some pious souls grant such people a new life. Recently, a couple from Italy gave a new life to such a child who was not adopted.

If we go into the details.. it was on December 30, 2018, someone wrapped a newborn baby in a plastic cover in a canal in Ulhassangar area of ​​Thane, Maharashtra. Locals noticed that the baby was crying. Immediately the social worker, Shivaji Ragde of Ashoka Foundation informed about this. Shivaji's couple reached there and took out the badly injured baby. The child was treated with the help of political leaders. After that, the child was named Tiger and admitted to a center called Vishwa Balak.

Tiger is now four years old. In this background, a couple from Italy who came to know about Tiger recently came forward to adopt the baby. After completing all the rules required for the adoption process in accordance with Indian laws, the tiger is ready to be taken away. All those who know about this are appreciating the greatness of the couple.

Telugu versio

మురికి కాలువలో అప్పుడే జన్మించిన చిన్నారి.. చెత్త కుప్పలో చిన్నారి లభ్యం.. ఇలాంటి వార్తలు నిత్యం ఏదో ఒక చోట వింటూనే ఉంటాం. ఇష్టానికి పిల్లల్ని కని కష్టంగా భావించే వారి వల్లే ఇలాంటి హృదయ విదారక సంఘటనలు జరుగుతుంటాయి. మనుషులు ఆడే ఈ నాటకంలో చివరికి ఆ చిన్నారులు బలి అవుతుంటారు. అయితే కొందరు పుణ్యాత్ములు అలాంటి వారిని హక్కు చేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ చిన్నారినే ఇటలీకి చెందిన జంట దత్తత తీసుకోని కొత్త జీవితాన్ని ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అది 2018 డిసెంబర్‌ 30వ తేదీ మహారాష్ట్రలోని ఠాణెలో ఉన్న ఉల్హాస్‌సంగర్‌ ప్రాంతంలోని ఓ కాలువలో అప్పుడే పుట్టిన ఓ శిశువును ఎవరో ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి పడేశాడు. పసికందు ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే సామాజిక కార్యకర్త, అశోక ఫౌండేషన్‌కు చెందిన శివాజీ రాగ్దేకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న శివాజీ దంపతులు తీవ్ర గాయాలతో ఉన్న శిశువును బయటకు తీశారు. రాజకీయల నాయకుల సహకారంతో ఆ చిన్నారికి చికిత్స అందించారు. అనంతరం ఆ చిన్నారికి టైగర్‌ అనే పేరు పెట్టి.. విశ్వ బాలక్‌ అనే కేంద్రంలో ఆ చిన్నారిని చేర్పించారు.

ప్రస్తుతం టైగర్‌ వయసు నాలుగేళ్లు. ఈ నేపథ్యంలోనే తాజాగా టైగర్‌ గురించి తెలుసుకున్న ఇటలీకి చెందిన ఓ జంట ఆ బాబును దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా దత్తత ప్రక్రియకు కావల్సిన అన్ని నియమాలను పూర్తి చేసి.. టైగర్‌ను తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆ జంట గొప్పతనాన్ని అభినందిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens