An inhumane incident took place in Madhya Pradesh's Gwalior. Vipin Ojha, an old man from the suburbs of Gwalior, fell down while riding a bicycle. His right leg was broken. An old man suffering from leg pain was taken to the hospital by his sister-in-law.
However, she did not know what to do as no stretcher was found in the hospital to move the old man who was unable to walk. She dragged the old man sitting on a bed sheet in a disorientated state. Recently this video has gone viral on social media and netizens are expressing their anger.
Telugu version
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ శివారు ప్రాంతానికి చెందిన విపిన్ ఓజా అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుండగా కిందపడిపోయాడు. దాంతో అతడి కుడికాలు విరిగిపోయింది. కాలునొప్పితో అవస్థ పడుతున్న వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది అతడి కోడలు.
అయితే, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని తరలించేందుకు ఆస్పత్రిలో స్ట్రెచర్ కనిపించకపోవడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచని స్థితిలో ఒక బెడ్‌షీట్‌పై వృద్ధుడిని కూర్చోబెట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.