As many advantages as there are with social media, there are disadvantages. Especially because of this, movie stars are often the masters of trolling. Some are ignoring these while others are strongly countering them. However, sometimes the trolling of these netizens is getting worse. Some are making obscene comments targeting the family members of movie stars. They are committing body shaming. Recently famous senior actress Khushboo's family has been affected by this body shaming. Some netizens made offensive comments on her daughters.
Khushboo expressed deep grief over this. They appealed to leave at least the children. Going into the details... Khushbhu recently shared a picture of her with her two daughters Avantika and Anandi on her Twitter account. Many have showered likes on this photo. It was praised as a cute fic. At the same time one of the brats commented that 'they got their nose surgery'. Khushboo expressed extreme impatience on this. 'What is the need for 20 and 22 year olds to undergo surgery with knives? It's a shame to troll on little kids. At least leave the children,' he said on TwitterKhushboo.
Telugu version
సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా తారలు వీటి కారణంగా తరచూ ట్రోలింగ్‌కు గురువుతున్నారు. కొందరు వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే మరికొందరు మాత్రం స్ట్రాంగ్‌గా కౌంటర్లిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఈ నెటిజన్ల ట్రోలింగ్ శ్రుతిమించిపోతోంది. కొందరు సినిమా తారల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ ఫ్యామిలీ ఈ బాడీ షేమింగ్ బారిన పడ్డారు. ఆమె కూతుళ్లపై కొందరు నెటిజన్లు అభ్యంతకర కామెంట్లు చేశారు. దీనిపై ఖుష్బూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం పిల్లలైనా వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఖుష్భూ తన ట్విటర్ ఖాతాలో తన ఇద్దరు కూతుర్లు అవంతిక, ఆనందిలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. చాలామంది ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపించారు. క్యూట్ ఫిక్ అంటూ ప్రశంసించారు. అదే సమయంలో ఒక ఆకతాయి ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు’ అని కామెంట్ చేశాడు. దీనిపై ఖుష్బూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ’20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ట్విట్టర్ వేదికగా వాపోయారు ఖుష్బూ.