Minister Seediri Appalaraju: AP Fisheries Minister Seediri Appalaraju gave a strong response to the land encroachments coming against him. He challenged that he would withdraw from politics if he or his followers prove that they have encroached an inch of land anywhere. He said that even if his team made a mistake, he made a mistake.
The minister organized a response program along with the officials at the municipal office on land encroachment in Palasa constituency. TDP leaders are repeatedly saying in front of the media that lands worth Rs 600 crores have been captured. The minister questioned why there was no complaint in the response program if the encroachment took place. He warned his followers that they will not be left alone if anyone speaks as they like.
Telugu version
Minister Seediri Appalaraju: తనపై వస్తున్న భూ అక్రమణలపై ఘాటుగా స్పందించారు ఏపీ మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. తాను గానీ, తన అనుచరులు గాని ఎక్కడైనా ఇంచ్ భూమి ఆక్రమించామని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను తప్పు చేసినట్టే అని అన్నారు.
పలాస నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు 600 కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జా అయ్యాయని మీడియా ముందు పదేపదే చెబుతున్నారు.
ఆక్రమణ జరిగితే స్పందన కార్యక్రమంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. తన అనుచరులపై ఎవరైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.