Skipping meals on time is one of the most harmful habits for health. If we don't have proper food and sleep every day, our body will slowly get sick. Health experts warn that having dinner late at night can cause many problems. Experts say that there is no problem if you eat a little late in the morning and afternoon, but you should get used to eating according to the time every night.
As far as possible, eat before 8 pm. Eating after that is injurious to health in every way. Eating food late at night causes the food to not digest properly and the body's metabolism starts working slowly. Good sleep can be achieved only if the food taken at night is properly digested. There should be a gap of two hours between our meal and bedtime. Otherwise sleep related problems start.
Telugu version
వేళకు భోజనం చేయకపోవడం ఆరోగ్యానికి హాని తలపెట్టే అలవాట్లలో ప్రధానమైనవి. ప్రతి రోజు మనకు సరైన తిండి, నిద్ర లేకపోతే మన శరీరం నెమ్మదిగా జబ్బుపడుతుంది. అందునా అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్న వేళల్లో కాస్త ఆలస్యంగా భోజనం చేసినా ఇబ్బంది ఉండదు.. కానీ రోజూ రాత్రి వేళ మాత్రం టైం ప్రకారం తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు రాత్రి 8 గంటలలోపు భోజనం చేయాలి.
ఆ తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి అన్ని విధాలా హానికరమట. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, శరీరంలోని జీవక్రియలు నెమ్మదిగా పనిచేయడం మొదలవుతుంది. రాత్రి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయితేనే మంచి నిద్ర పడుతుంది. భోజనానికి మనం పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. లేదంటే నిద్ర సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి. అందుకే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.