CM Jagan will deposit Rs. 10 thousand cash in their accounts today.

Chief Minister Jagan will release the third installment of Jagananna Chedodu's financial assistance on Monday. 3,30,145 people will deposit Rs.330.15 crores in their bank accounts by pressing a button in the program organized in Vinukonda of Palnadu district.


Jagananna Chedodu is a scheme launched by CM Jagan for the welfare of small scale traders. As part of this, the government is providing financial assistance to tailors, rajas and Nai Brahmins at the rate of Rs. 10,000 annually. Chief Minister Jagan will release the third installment of Jagananna Chedodu's financial assistance in this program on Monday. 3,30,145 people will deposit Rs.330.15 crores in their bank accounts by pressing a button in the program organized in Vinukonda of Palnadu district. The government has disclosed that the benefit of Rs.927.39 crores will be received so far along with the third installment. The concerned officials said that the eligible list was selected through the village and ward secretariats in a very transparent manner. The list of beneficiaries of this scheme is displayed in the village and ward secretariats. Those who were eligible last year and didn't get the money have been given an opportunity to apply again this time.Chief Minister Jagan will reach Vinukonda. Between 11.05 – 12.20 hours, they will participate in the public meeting arranged at Vinukonda Vellaturu Road and deposit cash in the accounts of the beneficiaries through the Jagananna Chedodu scheme. After the program, they will leave from there at 1.05 pm and reach Tadepalli residence at 1.45 pm.

Telugu Version

చిన్న తరహా వ్యాపారుల సంక్షేమార్థం సీఎం జగన్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో భాగంగా దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈక్రమంలో జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించే కార్యక్రమంలో 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. మూడో విడతతో కలిపి ఇప్పటివరకూ రూ.927.39 కోట్లను లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గతేడాది అర్హులై ఉండి డబ్బులు రాని వారికి ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు  జగనన్న వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 గంటల మధ్య వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens