The husband was taking his pregnant wife who was suffering from stomach pains to the hospital by car. Meanwhile, a large fire broke out in the car. As a result, along with the wife, the husband was also burnt alive in the car. On Thursday in the state of Kerala..
The husband was taking his pregnant wife who was suffering from stomach pains to the hospital by car. Meanwhile, a large fire broke out in the car. As a result, along with the wife, the husband was also burnt alive in the car. The tragic incident took place in Kerala state on Thursday. The deceased have been identified as Prijith (35) and his wife Risha (26) of Kuthiyathur in Kannur district.
The accident took place while Risha, who was suffering from labor pains, was being taken to the district government hospital in a 2020 model Maruti S-Presso car. A total of six people were traveling in the car at the time of the accident. But when the fire broke out in the vehicle, four people, including the child sitting in the back seat, jumped out. The front of the car was engulfed in flames and the doors could not be opened.
As a result, Prijit and Risha who were sitting in the front seat got stuck in the car. Locals came running and tried to save those trapped in the car but to no avail. The rescue team who reached the spot controlled the fire and took Prijith and Reesha out. But they were already found dead. Kannur City Police Commissioner Ajith Kumar informed the media that along with the dead, four injured persons have also been shifted to the hospital.
Telugu Version
పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణీ అయిన భార్యను కారులో ఆసుపత్రికి తరలిస్తున్నాడో భర్త. ఇంతలో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భార్యతోపాటు భర్త కూడా కారులోనే సజీవ దహనమయ్యారు. కేరళ రాష్ట్రంలో గురువారం నాడు..పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణీ అయిన భార్యను కారులో ఆసుపత్రికి తరలిస్తున్నాడో భర్త. ఇంతలో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భార్యతోపాటు భర్త కూడా కారులోనే సజీవ దహనమయ్యారు.
కేరళ రాష్ట్రంలో గురువారం నాడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులను కన్నూర్ జిల్లా కుత్తియాత్తూరుకు చెందిన ప్రిజిత్ (35), అతని భార్య రీషా (26)గా గుర్తించారు.
ప్రసవ నొప్పులతో బాధపడుతున్న రీషాను 2020 మోడల్ మారుతి ఎస్-ప్రెస్సో కారులో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఐతే వాహనంలో మంటలు చెలరేగడంతో వెనుక సీట్లో కూర్చున్న చిన్నారితో సహా నలుగురు బయటకు దూకారు. కారు ముందు భాగంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో డోర్లు ఓపెన్‌కాలేదు. దీంతో ముందు సీట్లో కూర్చున్న ప్రిజిత్-రీషా కారులోనే చిక్కుకుపోయారు.
స్థానికులు పరుగుపరుగున వచ్చి కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం మంటలను అదుపుచేసి, ప్రిజిత్, రీషాలను బయటకు తీశారు. ఐతే అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. మృతులతోసహా గాయాలపాలైన నలుగురిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు కన్నూర్ నగర పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్ మీడియాకు తెలియజేశారు. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాత అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించగలమని ఆయన తెలిపారు.