Another virus is causing a stir in India. Seven people have died in the last 24 hours in the state of West Bengal due to adeno virus. Adeno virus is killing children under two years of age and there is panic among the people.
The government was alerted by this incident. Adeno virus has started measures to combat it. Seven children died of respiratory infections in West Bengal in the last 24 hours, a senior health official said on Thursday. The state has so far reported 12 adenovirus deaths, eight of whom had multiple complications, the government said in a statement.
Telugu version
భారత్‌లో మరో వైరస్ అలజడి రేపుతోంది. అడెనో వైరస్.. కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. రెండేళ్లలోపు చిన్నారులను అడెనో వైరస్ బలి తీసుకుంటుండంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అడెనో వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్‌లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారని సీనియర్ ఆరోగ్య అధికారి గురువారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.