This West Indies batsman has done wonders in ILT20. He hit five consecutive sixes in five balls.
It is raining records in T20 cricket. There is no rain of fours and sixes in this format. Yuvraj Singh's six sixes on Steward Broad is already remembered by all. Yuvi achieved this feat in the 2007 T20 World Cup. However, in the recent International League T20 being held in the United Arab Emirates (UAE), a batsman tried to match Yuvraj and missed by just one shot.
In this league, Sherfan Rutherford of West Indies hit five consecutive sixes in five balls in a single over on Thursday.
Rutherford plays for Desert Vipers in this league. Vipers team batted first in this match against Dubai Capitals. Rutherford scored 50 runs in this match. He hit six sixes in 23 balls in this innings.
Drops for Yusuf Pathan..
He hit five sixes in the 16th over. Yusuf Pathan, who played for Team India, stood as a bowler. From the second ball to the last ball of this over, Rutherford hit five consecutive sixes. Second ball Rutherford hits the first six over Pathan's head. Hits the next six over long on. It is a 93 meter six. After that, he hit an 81 meter six. He pulls the fifth ball and hits a six on the leg side. He hit a sweep on the last ball of the over and hit the leg side for a six. However, Ruther Ford did not play the first ball of this over. Otherwise, netizens are commenting that he would have hit six sixes in a single over.
Telugu Version
ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ILT20లో అద్భుతాలు చేశాడు. ఐదు బంతుల్లో ఐదు వరుస సిక్సర్లు కొట్టాడు.
టీ20 క్రికెట్‌లో రికార్డుల వర్షం కురుస్తోంది. ఈ ఫార్మాట్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షానికి కొదువే లేదు. స్టీవార్డ్ బ్రాడ్‌పై యువరాజ్ సింగ్ చేసిన ఆరు సిక్సర్లు ఇప్పటికే అందరికీ గుర్తుండే ఉంటాయి. 2007 టీ20 ప్రపంచకప్‌లో యూవీ ఈ ఘనత సాధించాడు. అయితే, తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో యువరాజ్ ఫీట్ చేసేందుకు ఒక బ్యాట్స్‌మెన్ ప్రయత్ని చేసి, కేవలం ఒక షాట్ తేడాతో కోల్పోయాడు. ఈ లీగ్‌లో వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ గురువారం ఒకే ఓవర్‌లో ఐదు బంతుల్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు.
రూథర్‌ఫోర్డ్ ఈ లీగ్‌లో డిసర్ట్ వైపర్స్ తరపున ఆడుతున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైపర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.
యూసుఫ్ పఠాన్‌కు చుక్కలు..
16వ ఓవర్లో ఈ ఐదు సిక్సర్లు బాదాడు. బౌలర్‌గా టీమిండియా తరపున ఆడిన యూసుఫ్ పఠాన్ నిలిచాడు. ఈ ఓవర్ రెండో బంతి నుంచి చివరి బంతి వరకు రూథర్‌ఫోర్డ్ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. రెండో బంతికి రూథర్‌ఫోర్డ్ పఠాన్ తలపై తొలి సిక్స్ కొట్టాడు. లాంగ్ ఆన్‌లో తర్వాతి సిక్స్ కొట్టాడు. ఇది 93 మీటర్ల సిక్స్. ఆ తర్వాత 81 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఐదో బంతిని పుల్ చేసి లెగ్ సైడ్ లో సిక్సర్ కొట్టాడు. ఓవర్ చివరి బంతికి స్వీప్ కొట్టి లెగ్ సైడ్ లో సిక్సర్ బాదాడు. అయితే, ఈ ఓవర్ తొలి బంతిని రూథర్ ఫోర్డ్ ఆడలేదు. లేకుంటే ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత సాధించి ఉండేవాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.