హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే
ప్రఖ్యాత 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025లో తెలంగాణలో నిర్వహించనున్నారు. మే 7 నుండి 31 వరకు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది.
తెలంగాణలో గ్లోబల్ వేదిక
మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లీ ఈ వేడుక తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నదని తెలిపారు.
సంస్కృతి, అందాల కలయిక
తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి స్మితా సబర్వాల్ ఈ వేడుక తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని, రాష్ట్ర సంప్రదాయాలను, కళల ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో గ్రాండ్ క్రౌనింగ్
120కి పైగా దేశాల నుంచి అందాల రాణులు పోటీలో పాల్గొనగా, ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటం దరించిన క్రిస్టినా పిష్కోవా మే 31న తన వారసురాలిని ప్రకటించనుంది.