బాలీవుడ్ లో నటి తమన్నా భాటియా, విజయ్ వర్మ తమ సంబంధాన్ని ముగించుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ జంట Lust Stories 2 షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. 2023లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించగా, ఆ తరువాత వీరు తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు.
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమన్నా, “నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించాను, ఆ లో Vijay Varma ప్రవేశించాడు” అంటూ తన భావాలను వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, భవిష్యత్ ప్రణాళికల విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల తమన్నా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, విజయ్ వర్మ ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెట్టి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని సమాచారం. ఈ విభేదాల కారణంగా వారిద్దరి మధ్య అపార్థాలు పెరిగి, చివరికి విడిపోవడం జరిగింది.
ఇప్పటివరకు తమన్నా మరియు విజయ్ వర్మ తమ బ్రేకప్ గురించి అధికారికంగా స్పందించలేదు. కానీ, బాలీవుడ్ వర్గాల్లో వీరి బ్రేకప్‌పై ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి, వీరి అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.