IRCTC తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు! ఆధార్ తప్పనిసరి, కొత్త సమయం ప్రకటింపు
ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు అమల్లో ఉండగా, భారతీయ రైల్వే 2025లో తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఇకపై ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం మారింది!
ఇప్పటివరకు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ బుకింగ్ ఇకపై ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
ఎసీ & నాన్-ఎసీ కోచ్‌లకు ప్రత్యేక కోటా
తత్కాల్ టిక్కెట్ల కోసం ఐఆర్‌సీటీసీ ఏసీ మరియు నాన్-ఏసీ కోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించింది. కొత్త నిబంధనలతో ప్రయాణికులు కోరుకున్న సీట్లను పొందే అవకాశం ఉంటుంది.
ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత పారదర్శకత & సౌలభ్యం కలగనుంది అని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.