tics International

Two Years Baby Eat and Kills Snake in Turkey

The child in the photo above is 2 years old. Look how cute it is. It sounds like you want to pick up and kiss this bujjai when you see it..! If you know what he has done knowingly or not, you are sure to be a little shocked. Most people run away from a snake when they see it. Ummm, they run. Leave real snakes aside… even images of snakes on social media. Tingling. The girl in the above photo killed the snake by biting it with her mouth. This incident came to light in Bingol, Turkey. On August 10, the little girl was playing in her backyard when a 20-inch snake came across her. It bit the little girl on the lips. But did not recognize that it was a poisonous snake.. The baby put it in her mouth and bit it several times. With this the snake died. After that the child started screaming loudly. Neighbors came running there and were shocked to see the scene. First aid was immediately administered and rushed to Bingol Maternity and Children's Hospital. The doctors there gave the child an anti-venom injection and then kept her under observation for 24 hours. The doctors said that now the child is doing well and is recovering.

Telugu Version

పైన ఫోటోలోని చిన్నారి వయస్సు 2 సంవత్సరాలు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. చూడాగానే ఈ బుజ్జాయిని ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది కదూ..! తెలిసీ తెలియక తాను చేసిన పని తెలిస్తే మీరు ఒకింత షాకవ్వడం మాత్రం ఖాయం. చాలామంది పాము కనపడితే చాలు అక్కడి నుంచి లగెత్తుతారు. అమ్మో అని పరుగులు తీస్తారు. నిజమైన పాములు పక్కన పెట్టండి… సోషల్ మీడియాలో పాముల ఇమేజెస్ కనిపించినా సరే. జలదరింపుకు గురవుతారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న పసికూన మాత్రం పామును నోటితో కొరికి చంపేసింది. టర్కీ(Turkey)లోని బింగోల్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 10వ తేదీన చిన్నారి తన ఇంటి వెనుక తోటలో ఆడుకుంటుండగా.. ఓ 20-అంగుళాల పాము అక్కడికి వచ్చింది. అది ఆ చిన్నారిని పెదాలపై కాటు వేసింది. అయితే అది విషసర్పం అని గుర్తించక.. ఆ పసిసాప దాన్ని నోట్లో పెట్టుకుని పలుసార్లు కొరికేసింది. దీంతో ఆ స్నేక్ చనిపోయింది. అనంతరం చిన్నారి బిగ్గరగా అరవడం ప్రారంభించింది. దీంతో ఇరుగుపొరుగువారు అక్కడికి పరిగెత్తుకుని వచ్చి.. అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే ప్రథమ చికిత్స చేసి బింగోల్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారికి యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చి.. ఆపై 24 గంటలు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి బాగానే ఉందని, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens