alth

Rainy Season Eating Corn More Health Benefits

When it is drizzling.. if you eat corn (corn) roasted on hot coals, it will be different. Corn cobs are abundantly available this season. Whether the corn is roasted, boiled or eaten in the form of popcorn, the taste is on a different level. We know that corn has many health benefits. Health experts say that if you eat corn during monsoon, you will get protection from the diseases that come in this season. Maize is rich in fat, carbohydrate, protein, fiber and many vitamins and minerals that are good for health. Contains elements like zinc, phosphorus, magnesium, iron. They boost immunity. By eating it, many health problems are removed. Nutrients in corn help keep diabetes under control. Apart from that, it is good for the eyes. Prevents anemia. Improves digestion. Bones become strong. It provides good nutrients to the hair and makes it strong.

Corn reduces the problem of hair fall. Apart from that it prevents premature graying of hair. Helps keep the skin healthy and glowing. Due to the fiber present in corn, the problem of constipation is removed. Corn in any form has health benefits. You can enjoy corn flavors in different ways like boiled, roasted, roti, cake, samosa, masala.

Telugu Version

చిటపట చినుకులు పడుతున్న వేళ.. వేడి వేడి బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న (Corn) తింటే ఆ మజానే వేరు. ఈ సీజన్లో మొక్కజొన్న పొత్తులు విస్తారంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్ కార్న్ రూపంలో తీసుకున్నా టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. మొక్కజొన్న వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య (Health) నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. జింక్, పాస్ఫరస్, మెగ్నిషియం, ఐరన్లు వంటి మూలకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మొక్కజొన్న లోని పోషకాలు డయాబెటిస్ కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కళ్లకు మేలు చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. జుట్టుకు మంచి పోషకాలను అందించి బలంగా అయ్యేలా చేస్తాయి.

మొక్కజొన్న జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టు త్వరగా తెల్లబడడాన్ని నివారిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మొక్కజొన్నను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఉడబట్టి , కాల్చుకుని, రోటీలు, కేక్, సమోసా, మసాలా ఇలా వివిధ రకాలుగా కార్న్ రుచులను ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens