tics International

క్రొత్త ఆదాయపు పన్ను బిల్లు: ఐటీ రిటర్న్ ఆలస్యమైతే రీఫండ్ రాదా..? ఐటీ శాఖ ఏమి చెబుతోంది?

క్రొత్త ఆదాయపు పన్ను బిల్లు: ఐటీ రిటర్న్ ఆలస్యమైతే రీఫండ్ రాదా? ఐటీ శాఖ క్లారిటీ!

ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు తేదీని నిర్దేశిస్తుంది. కొత్త పన్ను బిల్లు చర్చల్లో ఉండటంతో చెల్లింపుదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రిటర్న్ లు ఆలస్యంగా దాఖలు చేస్తే రిఫండ్ రాదా? అనే విషయంలో అస్పష్టత పెరిగింది.

కొత్త పన్ను బిల్లు కింద గడువు తేదీ దాటిన తరువాత ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్ రాదనే ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ స్పందించి స్పష్టత ఇచ్చింది. ఆలస్యంగా పన్ను చెల్లిస్తే రిఫండ్ కోల్పోతామనే భయం చాలా మందిలో నెలకొంది. దీనిపై ఐటీ శాఖ "X" (మాజీ ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఐటీ శాఖ ఏమి చెబుతోంది?

ప్రస్తుత నిబంధనల ప్రకారం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. ఆలస్యమైతే డిసెంబర్ 31 వరకు జరిమానాతో రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇది రీఫండ్‌కు అర్హతను ప్రభావితం చేయదు అని అధికారులు స్పష్టం చేశారు.

కొత్త పన్ను బిల్లు ప్రకారం రీఫండ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ఐటీ శాఖ తెలిపింది. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినప్పటికీ, రీఫండ్ పొందే అవకాశం ఉంటుందని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

కొత్త చట్టం అమలుపై వివరాలు

కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆమోదం పొందితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం, క్లాజ్ 263(1)(a)(ix) ప్రకారం, గడువు లోపే రిటర్న్ దాఖలు చేసిన వారికి రీఫండ్ వర్తిస్తుందని నిబంధన చెబుతోంది. అయితే, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినవారికి కూడా రీఫండ్ లభిస్తుందని అధికారులు గుర్తుచేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens