తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎప్పటికప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. హీరో అక్కినేని నాగార్జున గత ఎనిమిది సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఇప్పుడు సీజన్ 9 మొదలవుతున్న నేపథ్యంలో, హోస్ట్ మారే అవకాశం ఉందనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి.
ఈసారి నాగార్జున స్థానంలో సినీ వేతరన్ నందమూరి బాలకృష్ణను (బాలయ్య) తీసుకొచ్చే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని సమాచారం. గత కొన్ని సీజన్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షక స్పందన రాకపోవడంతో, ఫార్మాట్‌లో మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ అనే టాక్ షోలో హోస్ట్‌గా భారీ విజయాన్ని అందుకున్నారు. అదే బలంగా మార్చి, బిగ్ బాస్‌కు కొత్త హైప్ తీసుకొచ్చే ఉద్దేశంతో నిర్వాహకులు బాలయ్యను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ షోకు బాగా ప్లస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. అలాగే, అన్‌స్టాపబుల్ షోనూ కంటిన్యూగా హోస్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు బిగ్ బాస్‌కి సమయం కేటాయించగలరా? అన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు.
కొత్త సీజన్ ప్రారంభానికి దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో, బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.