tics Telangana

Minister Sabita has ordered an inquiry into Satvik's suicide. A case has been registered against the management of Sri Chaitanya College

The management and staff of Sri Chaitanya College are unable to stop the harassment and suicides of students are increasing day by day. Due to this, the students who are supposed to have a golden future are losing their lives in fear of not being able to bear the torture of the staff. Recently in Narsingi Sri Chaitanya Campus, a student named Satvik hanged himself in the classroom.

 Parents of the student and fellow students say that he was forced to die due to extreme pressure from the management. There is widespread outrage over this incident. The family members and students of the deceased protested near the college campus. Education Minister Sabitha Indra Reddy expressed anger over Satvik's suicide in this program.Instructions were issued to Telangana Inter Board Secretary Naveen Mittal.

Telugu version

శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది వేదింపులు తాళలేక విద్యార్థుల ఆత్మ హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి..చదువు చెప్పాల్సిన సిబ్బందే విద్యార్థుల జీవితాలను ఆర్పేస్తునారు.. చదువు పేరుతో విద్యార్థుల పై చేయి చేసుకోవడం , వారిని టార్గెట్ చేసి కొట్టడం లాంటివి చేయడం తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతునారు. దీంతో బంగారు భవిష్యత్‌తో ఉండాల్సిన విద్యార్థులు సిబ్బంది పెట్టే టార్చర్ భరించలేక భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్‌లో సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌రూంలోనే ఉరేసుకున్నాడు.

 యాజమాన్యం తీవ్ర ఒత్తిడి వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌ దగ్గర ఆందోళనకు దిగారు. ఈక్రమంలో సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens